అధికారంలోకి వచ్చేది కేసీఆర్ కాదట


congress leaders hopes on power politicsఇంకా తొమ్మిది నెలల పాటు అధికారం ఉండగానే తొందరపడి ముందే అసెంబ్లీ ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాడని , వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు . ఇక ఇంకొంత మంది అయితే కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలను గెల్చుకుంటోందని అధికార టీఆర్ఎస్ పార్టీ కి కేవలం 33 స్థానాలు మాత్రమే వస్తాయని లెక్కలతో సహా ప్రచారం చేస్తున్నారు . లెక్కలు మాత్రమే కాదు ఏ ఏ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది , ఏ ఏ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవబోతున్నది శాసనసభ స్థానాలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు .

కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకా 9 నెలల సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోక ముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు . అంతేకాదు అసెంబ్లీ కి పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు రావడం వల్ల తన లక్ష్యం నెరవేరదని అందుకే ముందస్తు కి వెళ్ళాడు కేసీఆర్ . ఈ నాయకుడి అంచనాల మేరకు నవంబర్ లోనే తెలంగాణ శాసనసభ కు ఎన్నికలు జరుగుతాయని , 100 కుపైగా స్థానాలతో డిసెంబర్ లో మళ్ళీ అధికారం చేపడతానని అంటున్నాడు . కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నియంత పాలన అంతంఅయ్యిందని , ఇక అధికారం మాదేనని అంటున్నారు . ఎవరు ఏంటి ? ఎవరు ఎక్కడ కూర్చోవాలి అన్నది తెలంగాణ ప్రజలు త్వరలోనే తీర్పు ఇవ్వనున్నారు .

English Title: congress leaders hopes on power politics