ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్


Article 370
Article 370

ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది . కాంగ్రెస్ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్ , చిదంబరం లు మోడీ – షా ల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు . బలం ఉంది కదా ! అని ఇష్టారాజ్యంగా చేసేశారని , ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని పార్లమెంట్ ఉభయ సభలలో సుదీర్ఘంగా చర్చింది తుది నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదని , కానీ ఒక్క రోజులోనే సభలో బిల్లు ని ప్రవేశపెట్టడం , ఆమోదించడం అన్నది భారతదేశ చరిత్రలోనే జరగలేదని , ఇది అత్యంత దురదృష్ట కరమైన విషయమని ….. దీని ద్వారా భవిష్యత్ లో మరింత భయానక పరిస్థితులు నెలకొంటాయని ఆవేశం వెళ్లగక్కారు .

పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన దగ్గరా లేదు , పాక్ దగ్గర లేదు అక్కడ చైనా దళాలు ఉన్నాయి , వాటిని ఎదుర్కొంటారా ? యుద్దానికి తెరతీస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు . మోడీ – షా లు తీసుకున్న నిర్ణయం చాలా దారుణమైన నిర్ణయమని దుయ్యబట్టారు . బీజేపీ ఏకపక్షంగా తీసుకున్న ఆర్టికల్ 370 నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి .