బాలయ్య రౌడీ పోలీస్ వివాదం కానుందా ?

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా ”రౌడీ పోలీస్ ” గా కనిపించనున్నాడు . ఇంతకుముందు పలు మార్లు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు బాలయ్య వాటిలో రౌడీ ఇన్ స్పెక్టర్ చాలా పెద్ద హిట్ . అప్పట్లో ఆ సినిమా టైటిల్ పట్ల పోలీస్ అధికారుల సంఘం పెద్ద ఎత్తున అభ్యంతరం చెప్పడమే కాకుండా నిరసన వ్యక్తం చేసింది కూడా . అయితే ఆ చిత్ర దర్శక నిర్మాతలు పోలీస్ అధికారులతో మాట్లాడి టైటిల్ మార్చకుండా అలాగే విడుదల చేసారు బ్లాక్ బస్టర్ కొట్టారు .

ఇక ఇన్నాళ్ల తర్వాత బాలయ్య మళ్ళీ పోలీస్ గా నటిస్తున్నాడు కాకపోతే ఈ సినిమాకు ” రౌడీ పోలీస్ ” అనే టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది . దాంతో ఈ టైటిల్ తప్పకుండా వివాదాస్పదం అయ్యే ఛాన్స్ ఉంది . బాలయ్య పెద్ద హీరో కాబట్టి టైటిల్ ఇదే పెడతారా ? లేక మారుస్తారా ? చూడాలి . ఇక ఈ సినిమాకు తమిళ దర్శకులు కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్నాడు . ఇంతకుముందు బాలకృష్ణ – కే ఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో జై సింహా అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే .