వివాదాస్పద సినిమా నుండి మరో పోస్టర్


Controversy on Hansika muslim getup in Maha
Hansika muslim getup in Maha

హాట్ భామ  నటిస్తున్న 50 వ చిత్రం వివాదాన్ని రాజేసింది . ఇప్పటికే ఫస్ట్ లుక్ తీవ్ర వివాదం సృష్టించగా తాజాగా విడుదలైన మరో పోస్టర్ కూడా ఆ వివాదానికి మరింత ఆజ్యం పోసింది . జమీల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ” మహా ” చిత్రాన్ని మదియళగన్ నిర్మిస్తున్నాడు . కాగా ఈ సినిమా హన్సిక కు యాభయ్యవ చిత్రం కావడంతో సినిమా ఇంకా పూర్తికాకుండానే ఫస్ట్ లుక్ అంటూ విడుదల చేసారు .

కాషాయ వస్త్రాలను ధరించిన హన్సిక ధూమపానం చేస్తూ మహారాజా కుర్చీలో కూర్చున్న విధానంతో రచ్చ రచ్చ అయ్యింది . హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మహా పోస్టర్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు . కాగా ఇప్పుడేమో మరో లుక్ విడుదల చేసారు క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని . ఇక ఇందులో ముస్లిం యువతిగా కనిపిస్తోంది హన్సిక . పైగా వెనకాల పోస్టర్ లో గన్ పట్టి కాల్చబోతోంది . అసలు హన్సిక ఈ చిత్రంలో హిందువుగా నటిస్తోందా ? ముస్లిం గా నటిస్తోందా ? ఏంటో తెలియక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికే వివాదాన్ని సృష్టించిన మహా పోస్టర్ తాజాగా మరో వివాదాన్ని రాజేసింది .

English Title: Controversy on Hansika muslim getup in Maha