వివాదంలో సూపర్ 30 చిత్రం


 

Controversy on Hrithik roshan"s Super 30
Controversy on Hrithik roshan”s Super 30

హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ 30 చిత్రం వివాదంలో ఇరుక్కుంది . ఆనంద్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ పై కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఐ ఐ టి లో ఇప్పటివరకు ఎక్కువమంది విద్యార్థులను తన సూపర్ 30 సంస్థ ద్వారా చేర్పించినట్లు ప్రకటించుకున్నాడు ఆనంద్ కుమార్ అయితే ఆ లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వకుండా కేవలం అంకెలు మాత్రమే చెబుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయిస్తున్నారు కొంతమంది ఐ ఐ టి విద్యార్థులు .

ఆనంద్ కుమార్ జీవితాన్ని గొప్పగా చూపించండి అందులో అభ్యంతరం ఏమి లేదు కానీ ఐ ఐ టి లో ఎక్కువమంది ని చేర్పించానని చెప్పుకుంటున్న వ్యక్తి ఎందుకు ఆ పేర్లని విడుదల చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు సూపర్ 30 చిత్రాన్ని విడుదల కాకుండా చూడాలని కోరుతున్నారు . ఇటీవలే సూపర్ 30 టీజర్ విడుదల అయ్యింది , ఆ టీజర్ కు అద్భుత స్పందన వచ్చింది ,అయితే ఇప్పుడు వివాదం చుట్టుముట్టడంతో పాపం ! ఇబ్బందే వచ్చింది హృతిక్ రోషన్ కు .