ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ పై విమర్శలు


Ismart shankar
Ismart shankar

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ ఓ బి గ్రేడ్ సినిమాని తలపిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే . కాగా ఊర మాస్ ట్రైలర్ గా ఉన్న ఈ సినిమాపై కొంతమంది ఆసక్తి కనబరుస్తుండగా మరికొంతమంది మాత్రం తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు .

బూతు చిత్రంలా ఉందని కామెంట్ చేస్తున్నారు . సక్సెస్ కోసం పూరి జగన్నాధ్ బూతు చిత్రాలకు అలవాటు పడ్డాడా అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు . పైగా సినిమాలో బూతు సన్నివేశాలు మాత్రమే కాకుండా బూతు డైలాగ్స్ కూడా ఉన్నాయి దాంతో సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు . రామ్ హీరోగా నటించగా హీరోయిన్ లుగా నిధి అగర్వాల్ , నభా నటేష్ లు నటించారు . ఈ సినిమాని ఈనెల 18 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు పూరి జగన్నాధ్ .