ఆ యాడ్ వివాదాస్పదం ఎందుకయ్యిందంటే


controversy on nagarjunas kalyan jewellersకింగ్ నాగార్జున ముసలోడి గెటప్ లో ఒక యాడ్ ఆమధ్య అదేపనిగా ప్లే అయ్యింది కట్ చేస్తే దాన్ని సడెన్ గా ఆపేసారు ఎందుకంటే ఆ యాడ్ వివాదాస్పదం అయ్యింది కాబట్టి . ఇంతకీ ఆ యాడ్ వివాదాస్పదం కావడానికి కారణం ఏంటో తెలుసా ……. కళ్యాణ్ జువెల్లర్స్ గొప్పతనాన్ని చాటి చెప్పడానికి బదులు మొత్తం బ్యాంకింగ్ రంగాన్నే అవమానించేలా ఆ యాడ్ రూపొందడమే కారణం . ఇంతకీ నాగార్జున నటించిన యాడ్ లో ఏముందంటే ……. రిటైర్ అయిన తర్వాత తన మనవరాలి తో ఓ ముసలి వ్యక్తి బ్యాంక్ కు వస్తాడు . పెన్షన్ తనకు రెండుసార్లు పడిందని కాబట్టి ఒకదాన్ని తిరిగి తీసుకోమని బ్యాంక్ అధికారులను కోరతాడు కానీ వాళ్ళు సరిగ్గా స్పందించకుండా ఒక టేబుల్ నుండి మరో టేబుల్ కు అతడ్ని మార్చుతూ చివరకు బ్యాంక్ అధికారి దగ్గరకు పంపిస్తారు ఇక అతడేమో డబ్బులు ఎలాగూ అకౌంట్ లో పడ్డాయి కాబట్టి తీసుకోండి అంతేకాని మళ్ళీ తిరిగి ఇవ్వడం ఎందుకు ? పైగా అది పెద్ద ప్రాసెస్ అంటూ చెప్పుకొస్తారు దానికి ఆ పెద్దాయన ఒప్పుకోడు పైగా కళ్యాణ్ జువెల్లర్స్ లా నిజాయితీ ఉన్నవాడ్ని అని అంటాడు . దాంతో యాడ్ ముగుస్తుంది అంటే కళ్యాణ్ జువెల్లర్స్ నీతికి నిజాయితీ కి ఆలవాలం అయినట్లుగా చూపిస్తారు కానీ బ్యాంక్ వాళ్ళు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని చూపించారు .

దాంతో మొత్తం బ్యాంకింగ్ రంగమే కళ్యాణ్ జువెల్లర్స్ కి ఎదురు తిరిగింది , తక్షణం ఆ యాడ్ ఆపేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడంతో కళ్యాణ్ జువెల్లర్స్ యాడ్ ని రద్దు చేసుకుంది . తమ మీద నమ్మకం కలిగించడానికి చేసిన యాడ్ వివాదాస్పదం అవ్వడంతో కళ్యాణ్ జువెల్లర్స్ నిర్వాహకులు షాక్ తిన్నారు .

English Title: controversy on nagarjunas kalyan jewellers