రోబో కాపీ కథ లొల్లి ఇంకా అయిపోలేదు

controversy on robo storyసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన రోబో చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే అంతటి సంచలన విజయం సాధించిన ఆ చిత్రానికి కాపీ కథ లొల్లి అంటుకుంది. అరూర్ తమిళనాదన్ అనే రచయిత రోబో కథ నాదే అంటూ మద్రాస్ హైకోర్టు ని ఆశ్రయించాడు దాంతో ఎనిమిదేళ్లుగా కోర్టులో ఆ కేసు నానుతూనే ఉంది. జాగిబా అనే నవల నేను రాశానని దాని ఆధారంగానే రోబో తెరకెక్కిందని ఆరోపిస్తున్నాడు తమిళ నాథన్ అయితే దర్శకులు శంకర్ మాత్రం ఇది పూర్తిగా నేను రాసుకున్న కథ అని తమిళ నాథన్ రాసిన జాగిబా కు మా రోబో కు చాలా వ్యత్యాసం ఉందని కోర్టుకి విన్నవించాడు. శంకర్ చెబుతున్నది ఒకలా ఉండగా తమిళ నాథన్ చెబుతున్న దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది ఎందుకంటే అతడు రాసిన జాగిబా నవల పూర్తిస్థాయిలో రోబో ని పోలి లేదు కానీ పోలికలు ఉన్నాయి దాంతో అతడు కోర్టుని ఆశ్రయించాడు.

ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన రోబో ప్రభంజనం సృష్టించింది కాగా మళ్లీ ఇన్నాళ్లకు రోబో సీక్వెల్ 2.0 చిత్రం రూపొందుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ , హాట్ భామ అమీ జాక్సన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పలుమార్లు ఈ సినిమా విడుదల కార్యక్రమం వాయిదా పడటంతో కొంతమంది బయ్యర్లు ఒత్తిడి తెచ్చి పెట్టిన పెట్టుబడి కొంత వెనక్కి తీసుకున్నారు. తమ కథలను కాపీ కొట్టారని పలువురు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు, అయితే అవి మాత్రం తేలడం లేదు కానీ ఈ రోబో కథ మాత్రం ఏదో ఒకటి తేలనుంది.

English Title: controversy on robo story