సల్మాన్ ఖాన్ భారత్ సినిమాపై వివాదం


సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ” భారత్ ” చిత్రంపై వివాదం నెలకొంది . జూన్ 5 న భారత్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ వివాదం నెలకొంది దాంతో గందరగోళంగా మారింది వ్యవహారం . భారత్ అనే పేరుని సినిమాకు ఎలా వాడతారని ప్రశ్నిస్తూ విపిన్ త్యాగి అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు . భారత్ పేరుని బిజినెస్ కోసం వాడొద్దని హితువు పలుకుతున్నాడు .

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ పేరు భారత్ కావడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు విపిన్ త్యాగి . భారత్ పేరు వెంటనే మార్చాలని , సినిమా విడుదల ఆపేయాలని అంటున్నాడు . రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ఈ వివాదం అంటే అటు దర్శక నిర్మాతలకు ఇటు బయ్యర్లకు కూడా ఇబ్బందే ! అయితే ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ నటించిన భారత్ జూన్ 5 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది .