వివాదాస్పదమౌతున్న వీరే ది వెడ్డింగ్ చిత్రం


controversy on veere di weddingకరీనా కపూర్ , సోనం కపూర్ , స్వర భాస్కర్ , శిఖా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ” వీరే ది వెడ్డింగ్ ” . శశాంక్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలయ్యింది , కాగా ఈ సినిమా వివాదాస్పమౌతోంది . నలుగురు మహిళలు ఓ వెడ్డింగ్ లో కలిసిన సమయంలో తమ తమ వ్యక్తిగత జీవితాలు ఎలాంటి మలుపులకు లోనయ్యింది అంటూ చెప్పుకుంటూ స్వయం తృప్తి కి ఎలా దిగామన్నా విషయాన్నీ నిర్లజ్జగా చూపించడంతో వివాదం రేగుతోంది .

ముఖ్యంగా స్వర భాస్కర్ నటించిన సన్నివేశాలు మహిళలు చూడటానికి ఇబ్బందిగా ఉండటంతో ఆ సమయంలో ఇక సినిమా చూడకుండా వెళిపోతున్నామని , కుటుంబంతో కలిసి చూసే సినిమా ” వీరే ది వెడ్డింగ్ ” కాదని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు అంతేనా స్వర భాస్కర్ ని కూడా విమర్శిస్తున్నారు నెటిజన్లు .విమర్శల జడివాన ఎక్కువయ్యేసరికి స్వర భస్కర్ కూడా స్పందించింది . కొంతమంది కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు , అంతేకాదు డబ్బులిచ్చి మరీ విమర్శలు చేయిస్తున్నారు అని తిరిగి విమర్శలు చేస్తోంది స్వర భాస్కర్ .