క్రిష్ ని మరోసారి అవమానించిన కంగనా

Controvrsy again between krish and kangana ranaut
Kangana ranaut and Krish

ఎన్టీఆర్ బయోపిక్ కి ముందు క్రిష్ కంగనా రనౌత్ తో మణికర్ణిక చిత్రం చేసున్న విషయం తెలిసిందే . వీరనారి ఝాన్సీ రాణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మణికర్ణిక షూటింగ్ సమయంలో దర్శకులు క్రిష్ కు హీరోయిన్ మణికర్ణిక కు విబేధాలు రావడంతో ఆ సినిమా నుండి తప్పుకొని ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు . కట్ చేస్తే నిన్న మణికర్ణిక ట్రైలర్ విడుదల చేసారు . ఆ ట్రైలర్ కు బ్రహ్మాండమైన స్పందన వస్తోంది .

అయితే ఆ ట్రైలర్ వేడుకలో క్రిష్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు , క్రిష్ పేరెత్తకుండా ఈ సినిమా దర్శకుడు మధ్యలో వెళ్ళిపోతే మిగతా సినిమాని కంప్లీట్ చేసింది నేనే !ఇక ట్రైలర్ లో చూసిన విజువల్స్ కోసం నేను చాలా కష్టపడ్డాను నటిగానే కాదు దర్శకురాలిగా కూడా అంటూ క్రిష్ పనిని తుంగలో తొక్కేసింది . క్రిష్ దాదాపు 80 శాతం వరకు పనిచేసాడు . బ్యాలెన్స్ గా ఉన్న సన్నివేశాలను మాత్రమే కంగనా దర్శకత్వం వహించింది కానీ ఇప్పుడేమో సినిమాకు మొత్తం తానే కష్టపడినట్లు చెబుతోంది . అయితే క్రిష్ మాత్రం మణికర్ణిక గురించి , కంగనా గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు .

English Title: Controvrsy again between krish and kangana ranaut