సాహో పోస్టర్ పై కాపీ ఆరోపణలు


నిన్న రిలీజ్ అయిన ప్రభాస్ సాహో పోస్టర్ పై అప్పుడే కాపీ ఆరోపణలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . ఇన్నాళ్లు అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి ఏదైనా కాపీ జరిగితే అది తెలియడానికి చాలా రోజులు పట్టేది కానీ సోషల్ మీడియా రాకతో ఏది కాపీనో ఏది ఎక్కడి నుండి కొట్టేశారో క్షణాల్లో తెలిసిపోతోంది . ఇక కొంతమంది నెటిజన్లు అయితే రాకెట్ కంటే ఫాస్ట్ గా ఉంటారు ఒక పోస్టర్ అలా రావడమే ఆలస్యం ఇలా కాపీ తాలూకు స్టిల్ ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు .

తాజాగా ప్రభాస్ సాహో పోస్టర్ పై కూడా ఈ కాపీ ఆరోపణలు రాగా ఆ పోస్టర్ ని ఎక్కడి నుండి కాపీ కొట్టారో తెలియజేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు . అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . హాలీవుడ్ చిత్రాలైన బ్రేకింగ్ బ్యాడ్ తో పాటుగా హాంకాక్ చిత్రాల నుండి కాపీ కొట్టి సాహో పోస్టర్ ని రిలీజ్ చేసారంటూ విమర్శలు చేస్తున్నారు . నిజంగానే ప్రభాస్ పోస్టర్ కూడా అలాగే ఉంది మరి . అయితే కాపీ విషయాన్నీ పక్కన పెడితే కావాల్సింది హిట్ , అది ఆగస్టు లో ఈ హీరో అందిస్తాడా చూడాలి .