సాహో కొత్త పోస్టర్ పై కాపీ వివాదం


Saaho Poster
Saaho Poster

ప్రభాస్ నటించిన సాహో పోస్టర్ లపై మొదటి నుండి కాపీ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి . సాహో నుండి పోస్టర్ విడుదల అవ్వడమే ఆలస్యం అది ఫలానా సినిమా నుండి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఆ కాపీ తాలుకు పోస్టర్ ని అలాగే సాహో పోస్టర్ ని కంపేర్ చేస్తున్నారు . ఇక ఇప్పుడేమో కొత్త పోస్టర్ రాగా ఆ పోస్టర్ కూడా కాపీ అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు .

తాజా పోస్టర్ లో ప్రభాస్ కింద కూర్చొని ఉండగా అతడి మీద శ్రద్దా కపూర్ కూర్చొని గట్టిగా కౌగిలించుకున్న పోస్టర్ రణ్ బీర్ కపూర్ – ఐశ్వర్యారాయ్ ల పోస్టర్ లను పోల్చుతూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ . ఈ పోస్టర్ లలో స్వల్ప తేడాలు మాత్రమే ఉన్నాయి దాంతో కాపీ ఆరోపణలు వస్తున్నాయి . అయితే ఈ ఆరోపణల విషయం పక్కన పెడితే ఆగస్టు 30 న భారీ విడుదలకు సిద్ధమైంది సాహో .