ఐసోలేష‌న్‌లో వున్న 62 ఏళ్ల‌ వృద్ధుడు మృతి!


Corona effect one old man died at nizamabad isolation ward
Corona effect one old man died at nizamabad isolation ward

ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాలు ఆగ‌డం లేదు. ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికా వంటి అభివృద్ధి చెందిన  దేశాల్లో ఎన్ని జాగ్ర‌త్త‌లు పాటించినా మ‌ర‌ణాలు ఆగ‌డం లేదు. అక్క‌డ మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతూనే వుంది. ఇక మ‌న దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. దీంతో జాగ్ర‌త్త చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా తెలంగాణ‌లోని నిజామాబాద్ న‌గ‌రంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

దీంతో అత‌న్ని ఐసోలేష‌న్ పెట్టి వైద్యం అందిస్తున్నారు. తాజాగా ఆ వృద్ధుడు మమృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆదివారం ఐసోలేష‌న్‌కు త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. అయితే గ‌త అర్థ్ర రాత్రి చికిత్ప అందిస్తుండగా స‌ద‌రు వృద్ధుడు మృతి చెందిన‌ట్లు తెలిసింది. అయితే వృద్ధుడి మృతికి వైద్యుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని మృతుడి బంధువులు దాడికి దిగ‌డం క‌ల‌క‌లంగా మారింది.

అయితే డాక్ట‌ర్లు మాత్రం హైద‌రాబాద్ కు త‌ర‌లిస్తున్న నేప‌థ్యంలో గుండె పోటు రావ‌డంతో అత‌ను మ‌ర‌ణించాడ‌ని చెబుతున్నారు. వృద్ధుడి మృత దేహాన్ని తాకిన 11 మంది బంధువుల‌ని అధికారులు ఐసోలేష‌న్ వార్డుకు త‌ల‌రించిన‌ట్టు తెలిసింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతుడి ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి గాంధీ ఆసుప‌త్రికి ప‌రీక్ష కోసం త‌ర‌లించ‌డం అనుమానాలు రేకెత్తిస్తోంది.