క‌రోనా ఎఫెక్ట్‌: శ‌ర్వానంద్ సినిమా వైర‌ల్!


క‌రోనా ఎఫెక్ట్‌: శ‌ర్వానంద్ సినిమా వైర‌ల్!
క‌రోనా ఎఫెక్ట్‌: శ‌ర్వానంద్ సినిమా వైర‌ల్!

ప్ర‌పంచం మొత్తం బ‌యోవార్‌ని త‌ల‌పించేలా క‌రోనా వైర‌స్‌కు బెంబేలెత్తిపోతోంది. ఇటలీలో భ‌యంక‌రంగా ప్ర‌బ‌లుతున్న కరోనాని మ‌న దేశంలో క‌ట్ట‌డి చేయాలంటే క‌ఠిన నిర్ణ‌యాలు త‌ప్పవ‌ని దేశ ప్ర‌ధాని మోదీ గురువారం రాత్రి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు దేశ వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూని పాటించాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డంతో ప్ర‌జ‌ల్లో భ‌యం మొద‌లైంది.

ఏం జ‌ర‌గ‌బోతోంది? ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశం వుంది? మ‌నం ఇప్పుడు ఏ స్టేజ్‌లో వున్నాం? అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. ఇదిలా వుంటే ఓ సినిమా కాన్సెప్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి ఆక‌ట్టుకుంటోంది.  2017, సెప్టెంబ‌ర్ 29న విడుద‌లైన చిత్రం `మ‌హానుభావుడు`. శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో హీరో పాత్రకు శుభ్రం అతి శుభ్రం అనే ఓసీడీ వుంటుంది. దాని కార‌నంగానే త‌న ప్రేమ రిస్క్‌లో ప‌డుతుంది. త‌న చుట్టూ వున్న వాళ్లు ప‌రిశుభ్రంగా వుండాల‌ని, నిత్యం చేతులు క‌డుక్కోవాల‌ని సూచించిన ఈ క్యారెక్ట‌ర్‌, సినిమా కాన్సెప్ట్ ప్ర‌స్తుతం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

దీనిపై ద‌ర్శ‌కుడు మారుతి తాజాగా స్పందించారు. సామాజిక మాధ్య‌మాల్లో `మ‌హానుభావుడు` సినిమా గురించి ప్ర‌స్తావిస్తున్నారు. సినిమా తీసిన‌ప్పుడు మ‌రీ ఇలాంటి వాళ్లు కూడా వుంటారా? అతి శుభ్రం అంటే మ‌రీ ఇంత దారుణంగా వుంటుందా? అని అంతా  మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు విధిగా ప్ర‌తీ ఒక్క‌రూ అలాగే మారాల్సిన ప‌రిస్థితి. ప్ర‌స్తుతం మ‌న మంతా ఈ ప‌రిస్థి మారే వ‌రకు మ‌హానుభావుల‌మే. కరోనా కార‌ణంగా `మ‌హానుభావుడు` చిత్రాన్ని అంతా గుర్తుచేస్తుండ‌టం కొత్త అనుభూతినిస్తోంది `న్నారు.

Credit: Twitter