ఏపీలో 1650కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు!


ఏపీలో 1650కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు!
ఏపీలో 1650కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు!

క‌రోనా ఎంత క‌ట్ట‌డి చేసినా విజృంభిస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌లు దేశాల‌న్నీ లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించి క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేసినా ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నారు. మాన‌వ త‌ప్పిదాల కార‌ణంగానే పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు పాజిటివ్ కేసులు 42 వేలు దాట‌గా 1373 మ్ంది మృత్యువాత ప‌డ్డారు.

ఇదిలా వుంటే ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు ఎంత క‌ట్ట‌డి చేసినా మాన‌వ త‌ప్ప‌దాల కార‌ణంగా పెర‌గిపోతున్నాయి. ఇక ఏపీలో క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా పిజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఆగ‌డం లేదు. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 67 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 67 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్‌ని రిలీజ్ చేసింది. దీంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 524 మంది కోలుకొని డిచ్చార్జ్ కాగా, 1093 మంది వివిధ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో 25 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌ర్నూలులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌‌‌ 491కి చేరింది. గుంటూరులో 19 కేసులు న‌మోదు కాగా, ఆ  జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 338కి చేరింది.