క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌కు సింగ‌ర్‌ క‌న్నుమూత‌!

 

Corona virus effect american singer Jo diffie died
Corona virus effect american singer Jo diffie died

క‌రోనా మ‌హ‌మ్మ‌రి వ‌ర‌ల్డ్ వైడ్‌గా ల‌క్ష‌ల్లో ప్రాణాల్ని బ‌లితీసుకుంటోంది. ఏ దేశం గురించి విన్నా కరోనా కేసులే.. క‌రోనా వార్త‌లే. ప్ర‌పంచంలోని ఏ మూల నుంచి వార్త వ‌చ్చినా అది క‌రోనా మ‌ర‌ణ‌మే అవుతోంది. దీని ధాటికి దేశాన్నీ స్వియ నిర్భంధాన్ని ప్ర‌క‌టించాయి. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌తో పాటు జాతీయ స‌ర్వీసుల‌ని కూడా ర‌ద్దు చేసి ఎప్ప‌టి క‌ప్పుడు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాయి. అయినా మ‌ర‌ణాలు మాత్రం ఆగ‌డం లేదు.

జ‌నాలు క‌రోనా ధాటికి కుప్ప‌లు తెప్ప‌లుగా చ‌నిపోతూనే వున్నారు. ఇటలీలో క‌రోనా మ‌ర‌ణమృదంగం మోగిస్తోంది. అక్క‌డ రోజుకు వంద‌ల్లో ప్రాణాలు గాల్లో క‌లిసి పోతున్నాయి. అక్క‌డితో పాటు భూత‌ల స్వ‌ర్గంలా భావించే  స్పెయిన్ లోనూ క‌రోనా మ‌ర‌ణాలు ఆగ‌డం లేదు. రోజుల‌కు వంద‌ల్లో ప్రాణాలు పోతున్నాయి. ల‌కౌట్ ప్ర‌క‌టించ‌డంతో వీధుల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అపార్ట‌మెంట్‌ల నుంచి శ‌వాల దుర్గందం బ‌య‌టికి వ‌స్తోంది. అమెరికాలోనూ మ‌ర‌న‌మృదంగం మోగిస్తోంది.

తాజాగా అమెరికాకు చెందిన గాయ‌కుడు జో డిఫ్ఫే మ‌ర‌ణించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. గ్రామీ పుర‌స్కారం ద‌క్కించుకున్న జోకు కోవిడ్ 19 సోకిన‌ట్టు అధికారులు గుర్తించారు. అత‌న్ని కాపాడాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు కానీ ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌డంతో జో డిఫ్ఫే ఆదివారం మృతి చెందిన‌ట్టు అధికారులు తెలిపారు. చ‌నిపోవ‌డానికి రెండు రోజుల‌కు ముందు జో త‌న అభిమానుల్ని, ప్ర‌జ‌ల్ని ఉద్దేశించి చేసిన ప్ర‌క‌ట‌న ప‌లువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.