మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స్టాఫ్‌కు క‌రోనా పాజిటివ్‌!

మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స్టాఫ్‌కు క‌రోనా పాజిటివ్‌!
మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స్టాఫ్‌కు క‌రోనా పాజిటివ్‌!

దేశంలో క‌రోనా విజృంభిస్తోంది. ఏరంగంలో చూసినా క‌రోనా బాధితులే క‌నిపిస్తున్నారు. పోలీస్‌, డాక్ట‌ర్స్‌, న‌ర్సులు, రాజ‌కీయ నాయ‌కులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ముంబైలో క‌రోనా బారిన ప‌డిన వారి సంక్ష ప్రమాద స్థాయిలో పెరిగిపోతోంది. ఇందులో సినీ సెల‌బ్రిటీలు కూడా వుంటున్నారు. వారి ఇంటిలో ప‌నిచేసేవారి ద‌గ్గ‌రి నుంచి స్టాఫ్ వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

ఇదిలా వుంటే తాజాగా బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ స్టాఫ్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని అమీర్‌ఖాన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. `మా ఇంట్లో ప‌నిచేస్తున్న స్టాఫ్‌కు క‌రోనా అని నిర్థార‌ణ అయ్యింది. వారిని వెంట‌నే క్వారెంటైన్ చేశాం. ఆ త‌రువాత ముంబై మున్సిప‌ల్ అధికారులు వారిని తీసుకెళ్లి కావాల్సిన మెడిక‌ల్ సౌక‌ర్యాల‌ని అందించారు.ఈ సంద‌ర్భంగ వారి ప‌ట్ల కేర్ తీసుకున్నందుకు, వెంట‌నే ఇంటి ప‌రిస‌రాల‌ను స్టెరిలైజ్ చేసినందుకు వారికి కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు అమీర్‌ఖాన్‌.

ఇంట్లో వున్న వారంద‌రికీ టెస్టులు చేయించామ‌ని, అంద‌రికి నెగెటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం మా అమ్మ‌కు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ రావాల్సి వుంద‌ని, ఆమెకు నెగెటివ్ రిపోర్ట్ రావాల‌ని ప్రార్థించాల‌ని అమీర్ అభిమానుల‌ని కోరుతూ అమీర్ ఓ ఓపెన్ లెట‌ర్‌ని షేర్ చేశారు.