ముంచుకొస్తున్న ముప్పు –  జాగ్రత్త పడకపోతే ఇండియా మరో ఇటలీ


Coronavirus becoming a serious threat in India
Coronavirus becoming a serious threat in India

మనం రోజుకు రెండు పూటలా తినకపోయినా; మనకు ఇష్టమైన వాళ్ళని కలవకపోయినా; మనం చేసే ఉద్యోగం పోయినా.. మనం చేసే వ్యాపారంలో నష్టం వచ్చినా.. అవన్నీ మన ప్రాణం ముందు; మనం ఈ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న కుటుంబం ముందు తక్కువే అన్న విషయాన్ని గ్రహించాలి.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత దేశ కేంద్ర ప్రభుత్వం మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి నెల 31 వరకు లాక్ డౌన్ పాటించమని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ… ప్రజలు ఆదివారం అనగా మార్చి 22వ తేదీ కనబరిచిన స్ఫూర్తి ఆ తర్వాతి రోజు నుంచి దురదృష్టవశాత్తూ నిబంధనలను ఉల్లంఘించి కొంతమంది రోడ్లమీద తిరగడం కనిపిస్తోంది.

తాజా సమాచారం మేరకు ఒకసారి భారతదేశ ప్రభుత్వం కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాష్ బోర్డు పరిశీలించినట్లయితే మన దేశంలో ఇప్పటివరకూ 15 లక్షల 24 వేల 266 మందిని స్క్రీనింగ్ చేశారు. ఇప్పటివరకు 470 కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 39 మంది కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. కరోనా వైరస్ వల్ల ఇప్పటికి భారతదేశంలో అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు నమోదైన మరణాలు 9. అత్యధికంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. రాబోయే రెండు వారాలు యావత్ మన దేశానికి చాలా కీలకం. ఇప్పుడు గనక మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కరోనా వైరస్ స్టేజ్ 3 లోకి ప్రవేశిస్తే నేరుగా ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెంది ఒకేసారి మహమ్మారి లాగా వందల వేల మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,పోలీసులు,డాక్టర్లు, శాస్త్రవేత్తలు,ఆరోగ్య శాఖ నిపుణులు వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది,జర్నలిస్టులు మేధావులు,పౌర సమాజం అభ్యర్థన మేరకు ప్రజలందరూ తమ తమ అన్ని రకాల పనులను వాయిదా వేసుకొని ఎవరినీ కలవకుండా రాబోయే 15 రోజులు ఇంట్లోనే ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాము.