శంక‌ర్‌ని భ‌య‌పెడుతున్న క‌రోనా వైర‌స్‌!


శంక‌ర్‌ని భ‌య‌పెడుతున్న క‌రోనా వైర‌స్‌!
శంక‌ర్‌ని భ‌య‌పెడుతున్న క‌రోనా వైర‌స్‌!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. వ‌రుస మ‌ర‌ణాలు కూడా ఇత‌ర దేశాల‌ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. క‌రోనా వైర‌స్ ఇప్పుడు సినిమాల‌ని కూడా వ‌ణికిస్తోంది. దీని కార‌ణంగా నాగార్జున న‌టిస్తున్న `వైల్డ్ డాగ్‌` షూటింగ్ వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. థాయ్‌లాండ్‌లో కీల‌క షెడ్యూల్ చేయాల్సినల‌నుకున్నారు. అక్క‌డ క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలియ‌డంతో అర్థాంత‌రంగా థాయ్‌లాండ్ షెడ్యూల్‌ని ర‌ద్దు చేసుకున్నారు. ఇటీవ‌ల

తాజాగా క‌రోనా ఎఫెక్ట్ క‌మ‌ల్‌హాస‌న్ చిత్రాన్ని తాకింది. శంక‌ర్ డైరెక్ష‌న్‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1996లో వ‌చ్చిన `భార‌తీయుడు` చిత్రానికిది సీక్వెల్‌. ఇటీవ‌ల చెన్నై, రాజ‌స్థాన్‌, హైద‌రాబాద్‌ల‌లో ప‌లు స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం చెన్నైలోని బిన్నీ మిల్స్‌లో షూటింగ్ జ‌రుగుతోంది.

సినిమాకు సంబంధించిన ఓ కీల‌క షెడ్యూల్‌ని చైనాతో పాటు థాయ్‌లాండ్‌లో షూట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్లాన్ చేశాడ‌ట‌. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా చైనా, థాయ్‌లాండ్ కు వెళ్ల‌డానికి శంక‌ర్ భ‌య‌ప‌డుతున్నార‌ట‌. భారీ షెడ్యూల్ కీల‌క తారాగ‌ణం అంతా చైనా వెళ్లాలి. భారీ టీమ్‌.. ఇలా అంద‌రి జీవితాల్ని రిస్క్ లో పెట్ట‌డం ఇష్టం లేక ,. చైనా షెడ్యూల్‌ని శంక‌ర్ ర‌ద్దు చేసుకున్న‌ట్టు తెలిసింది. ఇందులోని కీల‌క పాత్ర‌ల్లో సిద్ధార్ధ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, బాబీసింహా న‌టిస్తున్నారు. అన్నీ క‌రెక్ట్‌గా కుదిరితే చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాల‌ని శంక‌ర్ ప్లాన్ చేస్తున్నాడు.