ఏదీ నిజం.? ; ఏదీ అబద్ధం.? – అయోమయంలో జనం


ఏదీ  నిజం.? ; ఏదీ అబద్ధం.? – అయోమయంలో జనం
ఏదీ నిజం.? ; ఏదీ అబద్ధం.? – అయోమయంలో జనం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశ ప్రధాని మోడీ గారు యావత్ దేశ ప్రజలను స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించమని విజ్ఞప్తి చేసిన సందర్భంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆ విజ్ఞప్తిని బలపరుస్తూ ప్రజలకు తమ అభిమానులకు లతా కర్ఫ్యూ పాటించమని తమ సోషల్ మీడియా ద్వారా సందేశం విడుదల చేశారు.అయితే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కరోనా వైరస్ ఈ పరిస్థితికి సంబంధించి ఇప్పటికీ సోషల్ మీడియా వేదికల పై ఎన్నో ఊహాగానాలు పుకార్లు చల్ చేస్తున్నాయి.

జనవరి 31 వ తేదీ ఇండియాలో అధికారికంగా కరోనా వైరస్ కేసు నమోదైన ఈ సందర్భంలో కూడా ఈ వ్యాధి ముందు ముందు ఇంకా భయంకరంగా మారే స్థితి పట్ల ప్రజలు ప్రభుత్వాలు ఏ మాత్రం సీరియస్ గా వ్యవహరించలేదు అన్నది నిజం. కొంతమంది ఈ వైరస్ వేసవి కాలంలో మనుగడ సాగించలేదని అధిక ఉష్ణోగ్రత దగ్గర ఈ వైరస్ చనిపోతుందని ప్రకటించారు. అది అవాస్తవం. 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సౌదీ అరేబియా దేశాలలో సైతం ఎంతో మంది మరణానికి కారణమైంది.

ఇక మరికొంతమంది జనతా కర్ఫ్యూ పాటించిన నేపథ్యంలో రాత్రిపూట హెలికాప్టర్ల ద్వారా కరోనా వైరస్ అరికట్టడానికి ఔషధం స్ప్రే చేస్తారని కూడా ప్రకటించారు.ఇది కూడా ఒక వాస్తవం. ప్రధాని నరేంద్ర మోడీ గారు సాయంత్రం ఐదు గంటలకు ప్రజలందరూ కరతాళధ్వనులతో కరోనా వైరస్ పై ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించాలని కోరుతున్ననేపథ్యంలో.. ఈ సమయంలో సౌరమండలంలో చంద్రుడు రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తాడు అని అలా చప్పట్లు కొట్టడం ద్వారా శక్తి ప్రసరితమై కరోనా వైరస్ అరికట్టబడుతుంది.” అని మరొక పుకారు ప్రచారం చేస్తున్నారు. ఇవాల్టి వరకూ కూడా బహిరంగ సభలు,  సమావేశాలపై నిషేధం విధించినప్పటికీ పూర్తిస్థాయిలో వాటి అమలు జరగడం లేదు.

నిన్న కూడా నిజామాబాద్ లో ఒక భారీ రాజకీయ విందు ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి సినీ రాజకీయ ప్రముఖులు ప్రచారం చేస్తున్నమాటిమాటికీ చేతులు నీళ్లతో శుభ్రపరచుకోవాలి అన్న ప్రచారం ప్రస్తుతానికి బాగానే ఉన్నా.. రాబోయే రోజుల్లో వేసవికాలం నీటి కొరత ఉండే నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఇలా ప్రతి రెండు గంటలకు ఒకసారి చేతులు కడుక్కోవడం ఎంతవరకూ సాధ్యపడుతుంది.? అన్న విషయం కూడా గమనించాలి

 తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి పై భారతదేశ ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ మరియు రజనీకాంత్ విడుదల చేసిన సందేశాలను ట్విట్టర్ ఇండియా నుంచి తొలగించారు.  సాధారణంగా అధికారిక విషయాలపై అనధికారిక సమాచారం విడుదల చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇలా చేయడం జరుగుతుంది

మరి కరోనా వైరస్ పై ప్రస్తుతం వారు విడుదల చేసిన సమాచారం అబద్దం అయితే అసలైన సమాచారం ఏమిటి.? నిజంగానే కరోనా వైరస్ వాతావరణంలో ఎంత వరకు ఉంటుంది.? ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాప్తి చెందుతుంది.? ఇలాంటి విషయాలకు ఇప్పటి వరకూ శాస్త్రపరంగా ఎవరు సమాధానం చెప్పడానికి ప్రయత్నించకపోవడం మన విషయం బాధాకరమైన విషయం.