మధ్యలో సాయి ధరమ్ తేజ్ పండగ చేసుకుంటున్నాడుగా!


correct time for sai dharam tej to score hit
correct time for sai dharam tej to score hit

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరసగా ఆరు ప్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో డీసెంట్ హిట్ కొట్టాడు. అయితే తాను కోల్పోయిన మార్కెట్ ను తిరిగి పొందాలంటే కచ్చితంగా ఒక సాలిడ్ హిట్ పడాలి. ప్రస్తుతం చేస్తున్న ప్రతిరోజూ పండగే అటువంటి సినిమా అవ్వగలదని సాయి ధరమ్ తేజ్ అనుకుంటున్నాడు. అందుకే పక్కాగా చూసుకుని డిసెంబర్ 20న చిత్రాన్ని విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నాడు. క్రిస్మస్ సెలవులు కూడా కలిసివస్తుండడంతో ఈ రిలీజ్ డేట్ పక్కాగా ఉంటుందని భావించాడు.

అయితే కొన్నాళ్ల క్రితం వరకూ తేజ్ కు ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఇదే రిలీజ్ డేట్ కు నందమూరి బాలకృష్ణ రూలర్, అక్కినేని నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ నటించిన వెంకీ మామ, నితిన్ భీష్మ, రవితేజ డిస్కో రాజా.. ఇలా చాలా సినిమాలు డిసెంబర్ 20 డేట్ ను టార్గెట్ చేస్తున్నాయని వార్తలు వచ్చాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి అంటే ట్రేడ్ తట్టుకోలేడు. కచ్చితంగా నష్టాలు చూడాల్సి వస్తుంది.

లేక లేక మంచి సినిమా చేస్తుంటే ఇదెక్కడి తలనొప్పిరా అనుకున్నాడు. అయితే సాయి ధరమ్ తేజ్ సుడి మాములుగా ఉన్నట్లు లేదు. అనుకోకుండా డిసెంబర్ 20 విడుదల కోసం చూసిన సినిమాలు అన్నీ ఇప్పుడు వేరే డేట్స్ కు వాయిదా పడిపోయాయి. సాయి ధరమ్ తేజ్ ఆ డేట్ కు ఒక్క నందమూరి బాలకృష్ణతో పోటీ పడితే చాలు. నిజానికి బాలయ్య గురించి కూడా అంతటెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వరసగా రెండు భారీ ప్లాపుల తర్వాత బాలయ్య చేస్తున్న చిత్రం, మార్కెట్ లో అంత బజ్ లేదు. దర్శకుడు కూడా నమ్మకం పెట్టుకోలేనివాడే. పోస్టర్స్ కూడా సాదాసీదాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ చూపు ముందు ప్రతిరోజూ పండగే పైనే ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మంచి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్న సినిమా అన్న భావన, మారుతి బ్రాం ఇమేజ్, ఆకట్టుకునే సెటప్ ఇలా అన్నీ ప్రతిరోజూ పండగేకు పాజిటివ్ గా ఉన్నాయి. మరి సుడి తేజ్ వైపు ఉన్న సమయంలో హిట్ కొట్టి మళ్ళీ తన మార్కెట్ ను చేజిక్కుంచుకుంటాడో లేదో తెలియాలంటే డిసెంబర్ 20 వరకూ ఆగాల్సిందే.