సాయి ధరమ్ తేజ్ కు అన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయేంటి?

Correct time for sai dharam tej to score hit
Correct time for sai dharam tej to score hit

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమైన సాయి ధరమ్ తేజ్ కెరీర్ మొదట్లో బాగానే ఉన్నా క్రమంగా ఒకటి తర్వాత ఒకటి ప్లాపులు మొదలయ్యాయి. అవి ఏకంగా డబల్ హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాయి. వరసగా ఆరు ప్లాపులు తిన్న సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా చిత్రలహరి చిత్రంతో ఉపశమనం పొందాడు. చిత్రలహరి ప్లాప్ కాకపోయినా సూపర్ హిట్ కూడా కాదు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ కు కొంత హోప్ నిచ్చింది. తను మళ్ళీ పూర్వపు మార్కెట్ తిరిగి పొందాలంటే ఒక సాలిడ్ హిట్ పడాల్సిందే. తన కెరీర్ కు ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగే అలాంటి సినిమానే అని భావిస్తున్నాడు తేజ్.

మారుతి ఎంటర్టైనెర్స్ తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. ఈ చిత్రంపై అన్నీ పాజిటివ్ గా ఉండడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు తేజ్. ప్రతిరోజూ పండగే టైటిల్ సాంగ్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. క్రిస్మస్ సెలవులు ఉండడంతో ఈ చిత్రానికి ఇది ప్లస్ అవుతుందని భావించారు.

అయితే అదే రోజున విడుదల చేయడానికి రవితేజ డిస్కో రాజా, శర్వానంద్ 96, నితిన్ భీష్మ, నందమూరి బాలకృష్ణ రూలర్ కూడా లైనప్ అవ్వడంతో సాయి ధరమ్ తేజ్ లో ఒకింత ఆందోళన మొదలైంది. కానీ వివిధ కారణాల వల్ల ఇప్పుడు భీష్మ ఫిబ్రవరికి వాయిదా.పడింది. 96 ను ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

డిస్కో రాజా సోలో రిలీజ్ కోసం జనవరి 24కి షిఫ్ట్ అయింది. సో, ఇక పోటీలో నందమూరి బాలకృష్ణ రూలర్ ఒక్కటే ఉంది. ఈ రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు కావడంతో ఎవరి ప్రేక్షకులు వారికి ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ కు సూపర్ హిట్ కొట్టడానికి ఇంతకుమించిన మంచి తరుణం మరొకటి లేదు. జనవరి 1 వరకూ ప్రతిరోజూ పండగేకి ఎదురులేదు.