ప్రభాస్ సినిమాపై కాపీ ఆరోపణలు


2011 లో రిలీజ్ అయినమిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీ అంటూ కోర్టు తేల్చినట్లు తెలుస్తోంది . ప్రభాస్ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ” మిస్టర్ పర్ఫెక్ట్ ” 2011 లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది . దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు . అయితే శ్యామలాదేవి అనే రచయిత ”నామనసు కోరింది నిన్నే ” అనే నవల రాసింది . కాగా ఆ నవల ఆధారంగా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాన్ని తీసారని , నాకు క్రెడిట్ ఇవ్వలేదని కోర్టు ని ఆశ్రయించింది .

పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు మిస్టర్ పర్ఫెక్ట్ కాపీ అని తేల్చిందట ! దిల్ రాజు ని సంప్రదించడానికి ప్రయత్నాలు చేసాను కానీ దిల్ రాజు వైపు నుండి సానుకూల వ్యవహారం లేకపోవడంతో కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని వాపోతోంది . అయితే దశరథ్ మాత్రం ఈ కథ నాదే కాపీ కాదు అని ఇప్పటికి అంటున్నాడు . ఈ గొడవ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .