తెలంగాణ‌లో కో వాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స్టార్ట్‌!


తెలంగాణ‌లో కో వాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స్టార్ట్‌!
తెలంగాణ‌లో కో వాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స్టార్ట్‌!

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు ప్ర‌మాద స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇదే త‌ర‌హాలో తెలంగాణ‌లో ముఖ్యంగా హైద‌రాబాద్‌లో క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తోంది. దీంతో భ‌యంతో సిటీ వ‌దిలి జ‌నం ప‌ల్లెబాట‌ప‌డుతున్నారు. చాలా వ‌ర‌కు క‌రోనా వైర‌స్ భ‌యంతో సిటీని విడిచి చాలా మంది గ్రామాల‌కు చేరుకున్నారు. జ‌నం భ‌య‌ప‌డుతున్న వేళ భార‌త్ బ‌యోటెక్ శుభ‌వార్త‌ని అందించింది. క‌రోనాని అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ని సిద్ధం చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది.

ఐసీఎంఆర్ భార‌త్ బ‌యోటెక్ ఆవిష్క‌రించిన‌ కోవ్యాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ని తెలంగాణ‌లో నిమ్స్ ఆసుప‌త్రిలో, ఏపీలో విశాఖ ఆసుప‌త్రిలో ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీంతో జ‌నం ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వ‌ర‌లోనే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంత‌మై వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల‌ని కోరుకుంటున్నారు. మంగ‌ళ‌వారం నుంచి భార‌త్ బ‌యోటెక్ ఆవిష్క‌రించిన‌ కోవ్యాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ తెలంగాణ‌లోని నిమ్స్‌లో మొద‌లైంది.

క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కోసం ఆరోగ్య‌వంతులైన వ్య‌క్తుల రిజిస్ట్రేష‌న్స్‌ని మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఆరోగ్యంగా వుండి ట్ర‌య‌ల్స్‌కు స‌మ్మ‌తించిన వ్య‌క్తుల ర‌క్త న‌మూనాల‌ను నిమ్స్ సిబ్బంది సేక‌రించ‌నున్నారు. ఆ ర‌క్త న‌మూనాల‌పై వివిధ ప‌రీక్ష‌లు జ‌రిపి ఆరోగ్యంగా వుంటే వారికి వారం త‌రువాత మొద‌టి డోస్ ఇవ్వ‌నున్నారు. ట్ర‌య‌ల్స్‌లో భాగంగా ఒక్కో వ్య‌క్తికి మూడు డోసులు వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నామ‌ని, తొలి డోస్ ఇచ్చిన త‌రువాత రెండు రోజుల పాటు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వుంచుతామ‌ని, ఆ త‌రువాత రెండ‌వ డోస్ 14 రోజుల త‌రువాత ఇస్తామ‌ని నిమ్స్ డైరెక్ట‌ర్ వెల్ల‌డించారు.