భారీ ప్రమోషన్, క్రేజ్ నడుమ… రేపే 4 లెటర్స్ విడుదల

Crazy film 4 letters for youthఈ శుక్రవారం టాలీవుడ్ ని ఓ సినిమా షేక్ చేసేలా కనిపిస్తోంది. అదే 4 లెటర్స్. ఈ మధ్య కాలంలో ఓ సినిమాను భారీ ప్రమోషన్ నడుమ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాతో ఈశ్వర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ ఎన్నారై కుర్రాడు తెలుగు ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వనున్నాడు. చిన్న సినిమా అయినా ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా భారీగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ సైతం 4 లెటర్స్ ప్రమోషన్ ను చూసి షాకవుతున్నారు.

 

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ స్థాపించి ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు ఈ సినిమా నిర్మించారు. క్వాలిటీ విషయంలో, ప్రమోషన్ విషయంలో ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ శుక్రవారం దాదాపు ఏడెనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ 4 లెటర్స్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే కారణం కేవలం ప్రమోషన్ మాత్రమే. అలాగే ఈ సినిమా ట్రైలర్స్ టెంప్టింగ్ గా ఉన్నాయి.  ఏ. ర‌ఘురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `4 లెట‌ర్స్` చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు రఘు రాజ్ యూత్ అండ్ మాస్ ఆడియెన్స్ కి కావాల్సిన విధంగా మంచి విందు భోజనం పెట్టనున్నారు. సినిమాకు తగ్గట్టుగానే ఇద్దరు హీరోయిన్స్ బికినీలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రేక్షకుల గుండెల్లో సెగలు రేపుతున్నారు. ఈ సినిమా పోస్టర్స్ చూసిన తర్వాత యూత్ లో క్రేజీ సినిమాగా హాట్ కేక్ గా మారింది.

 

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యూత్ పుల్ రొమాంటిక్ కామెడీ చిత్రం `ఫోర్ లెట‌ర్స్`. ఫ్యూర్ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది. ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు అంత‌ర్లీనంగా “యూత్ అనుకుంటే ఏమైనా చేయగ‌ల‌రు“ అనే మెసేజ్ ఇస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన పాటలు ఇప్పటికే మారుమోగుతున్నాయి. ఇంత పాజిటివ్ వైబ్స్ తో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గా ప్రేక్షకుల్ని మెచ్చే సినిమా అవుతుందని నిర్మాత ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

English Title: Crazy film 4 letters for youth