`ఆచార్య‌`లో చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టించేది ఎవ‌రు?`ఆచార్య‌`లో చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టించేది ఎవ‌రు?
`ఆచార్య‌`లో చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టించేది ఎవ‌రు?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌`. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఎనిమిది నెల‌ల విరామం త‌రువాత ఇటీవ‌లే మొద‌లైంది. కొర‌టా శివ మెగాస్టార్ లేకుండానే ఈ మూవీ షూటింగ్‌ని మొద‌లుపెట్టేశారు. తాజాగా చిరు సెట్లోకి అడుగుపెట్టిన‌ట్టు తెలుస్తోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ కోసం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్‌తో ఓ టెంపుల్‌, ఓ విలేజ‌ప్ సెట్ ని ఏర్పాటు చేశారు.

ఇందులోనే మూవీకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నార‌ట‌. దేవాదాయ భూముల స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కీల‌క అతిథి పాత్ర‌లో హీరో రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` షెడ్యూల్ కార‌ణంగా చ‌ర‌ణ్ ఎంట్రీ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. జ‌న‌వ‌రి మూడ‌వ వారం నుంచి రామ్‌చ‌ర‌ణ్ ఈ మూవీ షెడ్యూల్‌లో పాల్గొంటార‌ట‌.

ఇదిలా వుంటే ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టించేది ఎవ‌రు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. స‌మంత వంటి స్టార్ హీరోయిన్‌ల పేర్లు వినిపించినా ఫైన‌ల్‌గా ఇందులో ర‌ష్మిక మంద‌న్న‌ న‌టించ‌నుంద‌ని తెలుస్ఓంది. త్వ‌ర‌లోనే అధికారికంగా చిత్ర బృందం  ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. సింగిల్  షెడ్యూల్‌లో చ‌ర‌ణ్‌, ర‌ష్మిక‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని కొర‌టాల పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశారని ఇన్ సైడ్ టాక్‌‌.