క్రేజీ రీమేక్ కోసం స్టార్ హీరోయిన్‌!


Crezy heroine for Pink remake
Crezy heroine for Pink remake

బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, తాప్సీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `పింక్‌`. అత్యాచారానికి గురైన ముగ్గురు అమ్మాయిల క‌థ‌గా బాలీవుడ్ అనిరుద్ధ రాయ్ రూపొందించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. అత్య‌ధిక భాగం కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రాన్ని త‌మిళంలో `నేర్కొండ పార్వై` పేరుతో బోనీక‌పూర్ రీమేక్ చేశారు. `ఖాకీ` ఫేమ్ వినోద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అజిత్ హీరోగా న‌టించారు. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో అజిత్ న‌టించిన ఈ చిత్రం అక్క‌డ కూడా రికార్డు క‌లెక్ష‌న్‌ల‌ని సాధించి బాక్సాపీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

అ చిత్రాన్ని బోనీ క‌పూర్‌, దిల్ రాజు సంయుక్తంగా తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించిన మేక‌ర్స్ ఇందులో హీరోగా ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగులో ప‌వ‌న్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని తాజాగా జ‌రిగిన దిశ ఉదంతాన్ని కూడా ఇందులో చూపించే అవ‌కాశం వుంద‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం కోసం ముగ్గురు కొత్త వాళ్ల‌ని ఎంపిక చేసుకోవాల‌నుకున్న చిత్ర నిర్మాత‌లు కీల‌క‌మైన తాప్సీ పాత్ర కోసం మాత్రం క్రేజీ క‌థానాయిక స‌మంత‌ని అడుగుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో మేక‌ర్స్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని, ఈ రిమేక్‌లో న‌టించ‌డానికి స‌మంత కూడా సుముఖంగా వున్న‌ట్టు తెలుస్తోంది. స‌మంత ప్ర‌స్తుతం త‌మిళ హిట్ చిత్రం `96` ఆధారంగా రూపొందుతున్నతెలుగు రీమేక్‌తో పాటు రాజ్ ఎన్‌. డీకే ద‌ర్శ‌క ద్వ‌యం రూపొందిస్తున్న `ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాలు నిర్మాణ ద‌శ‌లో వున్నాయి.