సర్కార్ ఫస్ట్ లుక్ పై పెద్ద ఎత్తున విమర్శలు


criticism on vijays sarkar first look

తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా నటిస్తున్న సర్కార్ చిత్రం ఫస్ట్ లుక్ తీవ్ర వివాదాన్ని రాజేస్తోంది . విజయ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని సర్కార్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు . ఆ లుక్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది , అయితే అంతకంటే ఎక్కువ వివాదాన్ని కూడా తెచ్చిపెట్టింది . ఇంతకీ సర్కార్ చిత్రంలో వివాదాస్పదం అయినది ఏదో తెలుసా …… సిగరెట్ . విజయ్ స్టైల్ గా సిగరెట్ తాగుతూ ఉండటమే ఈ వివాదానికి కారణం .

విజయ్ స్టార్ హీరో పైగా రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కావడంతో యువతని , అభిమానులను పక్క దోవ పట్టించే అవకాశం ఉందని …… యువతని సిగరెట్ల కు బానిస చేసేలా విజయ్ లుక్ ఉందని రాజకీయ నాయకులు , సామాజిక సేవా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు . విజయ్ ని అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు . సర్కార్ లుక్ లో విజయ్ చాలా బాగున్నాడని అయితే ఆ సిగరెట్ లేకపోతే ఇంకా బాగుండేదని సలహా కూడా ఇస్తున్నారు . ఇంతకుముందు కూడా విజయ్ కి ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఇకపై మద్యపానం , ధూమపానం లాంటి ప్రకటనలకు ఛాన్స్ ఇవ్వనని మాటిచ్చాడు కానీ తాజాగా సర్కార్ విషయంలో పొరబడ్డాడు విజయ్ దాంతో విమర్శలు వస్తున్నాయి .