చిరు సినిమాకు అచొచ్చిన బ్యాక్ డ్రాప్ ను సెట్ చేసిన మెహర్


చిరు సినిమాకు అచొచ్చిన బ్యాక్ డ్రాప్ ను సెట్ చేసిన మెహర్
చిరు సినిమాకు అచొచ్చిన బ్యాక్ డ్రాప్ ను సెట్ చేసిన మెహర్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయింది. అయితే ఈ నెల దసరా తర్వాత ఆచార్య షూట్ ను మొదలుపెట్టాలని కొరటాల శివ అండ్ టీమ్ భావిస్తున్నారు. దసరా తర్వాత మొదలుపెట్టి వచ్చే మార్చ్ కల్లా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే సమ్మర్ లో సినిమాను విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆచార్య పూర్తయ్యాక చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో పనిచేయనున్న విషయం తెల్సిందే.

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి తమిళ సూపర్ హిట్ వేదాళం సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినా మెహర్ రమేష్ తో సినిమా చేస్తోన్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు చిరు.

ఇక వేదాళం రీమేక్ పై మెహర్ మూడేళ్ళుగా కష్టపడ్డాడని తెలుస్తోంది. ఇటీవలే చిరంజీవిని కలిసిన మెహర్ రమేష్ ఒక్క సిట్టింగ్ లోనేమెప్పించాడట. అన్నాచెల్లళ్ళ బంధం ఎఫెక్టివ్ గా చూపించే ఈ చిత్రానికి కలకత్తా బ్యాక్ డ్రాప్ ను మెహర్ ఎంచుకున్నాడని సమాచారం. చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ చూడాలని ఉంది చిత్రానికి కూడా కలకత్తా బ్యాక్ డ్రాప్ లోనే తీసిన విషయం తెల్సిందే. మరోసారి అదే బ్యాక్ డ్రాప్ అంటే కచ్చితంగా ఫ్యాన్స్ ఉత్సాహం వేరే లెవెల్లో ఉంటుంది.