తేజ నేర్చుకుంటున్న కొత్త కోర్సేంటీ?


తేజ నేర్చుకుంటున్న కొత్త కోర్సేంటీ?
తేజ నేర్చుకుంటున్న కొత్త కోర్సేంటీ?

అంద‌రికి భిన్నంగా ఆలోచించ‌డం తేజ స్టైల్‌.  అంతా హీరోల వెంట‌ప‌డుతూ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు తీస్తున్న వేళ కొత్త వాళ్ల‌తో కొత్త త‌ర‌హా ల‌వ్‌స్టోరీస్ చేసి ఔరా అనిపించారు. ఎప్పుడూ భిన్నంగా ఆలోచించే తేజ క‌రోనా విళ‌య తాండ‌వం చేస్తున్న వేళ కొత్త‌గా ఆలోచిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. క‌రోనా కార‌ణంగా యావ‌త్ ప్ర‌పంచం వ‌ణికిపోతున్న వేళ  సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఇంటి ప‌ట్టునే వుంటున్నారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటి ప‌ట్టున‌ వుంటున్న సెల‌బ్రిటీల్లో చాలా మంది వంట‌లు చేస్తున్నారు. మ‌రి కొంత మంది వ‌ర్క‌వుట్‌లు చేస్తూ ఆ వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది ద‌ర్శ‌కులు మాత్రం ఈ లాక్‌డౌన్ పిరియ‌డ్‌ని కొత్త క‌థ‌ల‌కు ఉప‌యోగిస్తున్నారు. ఇదిలా వుంటే ద‌ర్శ‌కుడు తేజ మాత్రం కొత్త కోర్సులో చేర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ ఆన్‌లైన్‌లో ప్ర‌వేశ పెట్టిన కోర్సులో ద‌ర్శ‌కుడు తేజ ఆన్ లైన్‌లో రిజిస్ట‌ర్ చేసుకుఏన్నార‌ట‌. ఊపిరితిత్తుల‌కు సంబంధించిన కోర్సుని ఆయ‌న నేర్చుకుంటున్న‌ట్టు తెలిసింది. భ‌విష్య‌త్తులో క‌రోనా లాంటి వైర‌స్ లు ప్ర‌న‌బ‌లిన‌ప్పుడు ఎలా వుండాలి?. వాటిని ఎలా ఎదుర్కోవాలి వంటి విష‌యాల్ని తేజ నేర్చుకోవాల‌నే ఈ కోర్సులో చేరార‌ని తెలిసింది.