డాంగ్ ..డాంగ్ అంటున్నతమన్నాDaang Daang Video Song from Sarileru Neekevvaru
Daang Daang Video Song from Sarileru Neekevvaru

70 ఎం.ఎం స్క్రీన్ మీద తెల్లగా ఉన్న తమన్నా పక్కన మన మహేష్ బాబు కలిసి స్టెప్పులేస్తుంటే ఇంకేం కావాలమ్మా…!

సరిలేరు నీకెవ్వరు టీం ఫ్యాన్స్ అందరికీ ఈ చలిలో న్యూ ఇయర్ గిఫ్ట్ ఇలా ప్లాన్ చేసింది. ఎంత మిలటరీ ప్యాంట్ వేసుకున్నా, ఆవిరి కుడుము లాంటి నడుము చూపిస్తూ తమన్నా, ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై… తు ఆజానా..! అంటూ పాడుతుంటే, మహేష్ బాబు డ్యాన్స్ స్క్రీన్ షేక్ అయిపొయింది. ఇక సూర్యుడివో.. చంద్రుదివో అనే ఎమోషనల్ సాంగ్ రాసిన రామ జోగయ్య శాస్త్రి గారు ఈ పాటను కూడా రాసారు. ఇలాంటి పాటల ట్రేడ్ మార్క్ స్పెషలిస్ట్ దేవి శ్రీ మ్యూజిక్ ఈ పాటకి హైలెట్.

మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ న్యూ ఇయర్ కి బాబు ఇచ్చిన గిఫ్ట్ కి ఫుల్ ఖుష్ అయిపోయారు. ఇక పాట మొత్తం రిలీజ్ చెయ్యలేదు. ఇప్పటికే సంక్రాంతి కి రిలీజ్ అయ్యే సినిమాల మధ్య డిజిటల్ వేదికగా, ప్రమోషన్ వార్ నడుస్తోంది. ఇక సరిలేరు నీకెవ్వరు టీం ఇంకొక అడుగు ముందుకేసి, మెగాస్టార్ చిరంజీవి ని ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా ఖరారు చేసి అభిమానుల అంచనాలు ఆకాశానికి చేరేలా చేసింది. ఏది ఏమైనా ప్రస్తుతానికి నిప్పుతో చలి కాచుకున్నట్టు, తమన్నా పాటతో న్యూ ఇయర్ ఎంజాయ్ చేద్దాం.