సల్మాన్ ఖాన్ సినిమా అంటే అంత విజీ కాదు


Dabang 3 climax fight with 500 fighters
Dabang 3 climax fight with 500 fighters

గతంలో పూరీ జగన్నాధ్ గారి డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన “నేనింతే” అనే సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ వేసి, ఇప్పుడు ఫామ్ ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక మాట అంటాడు. “హీరో ఇంట్రడక్షన్ ఫైట్ కి 50 మందిని, ఇంటర్వెల్ బ్యాంగ్ కి 100 మందిని నరకాలి. అదే క్లైమాక్స్ ఫైట్ కి అయితే 200 మందిని నరికినట్లు కథలు రాయమంటున్నారు”. ఇక కొత్త కథలు ఎక్కడి నుండి వస్తాయి. అని అడుగుతాడు. పరోక్షంగా కథలు వినకుండా, తమ ఇమేజ్ మీద సినిమాలు ఉండాలని కోరుకునే హీరోలకు సెటైర్ గా ఆ సీన్ ఉంటుంది. వినడానికి కాసేపు కామెడీగా ఉన్నా, ఇప్పటికి హీరోలు కథ పట్టుకుని ఉంటే, ముందు ఫైట్ లు, సాంగ్స్ , కామెడీ ట్రాకులు ఇలా తమ పైత్యాన్ని దర్శకుల మీద రుద్దుతూనే ఉన్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా తీస్తున్న దబాంగ్ 3 సినిమాలో అయితే క్లైమాక్స్ ఫైట్ లో 100 కార్లు, & 500 మందిని సల్మాన్ క్యారెక్టర్ ఒక్కడే సింగల్ గా సిక్స్ ప్యాక్ తో డీల్ చేస్తాడని సినిమా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దానికి సంబంధించి, సల్మాన్ మరియు విలన్ కిచ్చ సుదీప్ మధ్య ఉన్న ఒక ఫైట్ వీడియో కూడా రిలీజ్ చేసారు. అందులో సల్మాన్ తన ముందు ఉన్న విలన్ తో ,

“నా ముందు ఉన్నది అలీ, నా వెనుక వున్నది భజరంగ బలి;  ఇక నువ్వు నన్ను ఎం చెయ్యలేవు బలి (విలన్ పేరు) ” అని పంచ డైలాగ్ కూడా చెప్తాడు. దబాంగ్  1 పార్ట్ వరకూ బానే ఉన్నది కానీ, ఎప్పుడైతే దబాంగ్ ఫ్రాంచైజీ సల్మాన్, అతని సోదరుల చేయ్తిలోకి వెళ్లిందో మరీ, కొన్ని సీన్ లు లాజిక్ లేకుండా ఆర్టిఫిషియల్ గా చేస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

 మరీ, సల్మాన్ ఈ నిజాన్ని అర్ధం చేసుకుంటాడా.? లేక బాలీవుడ్ బాలకృష్ణ అని అనిపించుకుంటూ ఉంటాడో చూడాలి.