దబంగ్ 3 మూవీ రివ్యూ


దబంగ్ 3 మూవీ రివ్యూ
దబంగ్ 3 మూవీ రివ్యూ

నటీనటులు: సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, సుదీప్, సాయీ మంజ్రేకర్ తదితరులు
దర్శకత్వం: ప్రభుదేవా
నిర్మాణం: సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది
సంగీతం: సాజిద్-వాజిద్
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019
రేటింగ్: 2.5/5

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. భారత్ తో ఓపెనింగ్స్ రాబట్టిన అంచనాల్ని అందుకోలేకపోయిన సల్మాన్ ఖాన్, తనకు అచొచ్చిన దబంగ్ నుండి మూడో సినిమాను వదిలాడు. తనకు వాంటెడ్ తో బిగ్ బ్రేక్ ఇచ్చిన ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా చేసాడు సల్మాన్ ఖాన్. మరి మూడో దబంగ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
కథగా చెప్పుకుంటే దబంగ్ 3 చాలా సింపుల్. చుల్ బుల్ పాండే(సల్మాన్ ఖాన్) ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. తన భార్య రాజో(సోనాక్షి సిన్హా)తో జీవితాన్ని హాయిగా గడుపుతుంటాడు. అలాగే డ్యూటీ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే పాండే, ఒక ముఠాతో అయిన గొడవ కారణంగా బలీసింగ్ తో ఫేస్ టు ఫేస్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఇద్దరూ ఎదురుపడినప్పుడు ఇద్దరి మధ్యా గతంలో ఏదో జరిగిందని తెలుస్తోంది. పాండే గతానికి బలీసింగ్ కు సంబంధం ఏంటి? పాండే జీవితాన్ని ఈ బలీసింగ్ ఎలా ఎఫెక్ట్ చేసాడు? అసలు ఏమైంది? తర్వాత ఏమవుతుంది? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:
దబంగ్ సిరీస్ అనగానే సల్మాన్ ఖాన్ లో ఒక విధమైన ఎనర్జీ వస్తుంది. తనకే సొంతమైన మ్యానరిజమ్స్ తో డైలాగ్స్ తో సల్మాన్ ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తాడు. ఫైట్స్ లో కూడా కామెడీ చేయడం మెయిన్ ప్లస్ గా మారింది. మొత్తంగా ఈ చిత్రం సల్మాన్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. సోనాక్షి సిన్హాకు చెప్పుకోవాటానికి పెద్ద పాత్రంటూ ఏం లేదు. ఉన్నంతలో బానే చేసింది. కొత్తమ్మాయి సాయీ మంజ్రేకర్ ఆకట్టుకుంటుంది. ఉండేది కాసేపే అయినా ఆమె పెరఫార్మన్స్ బాగుంది. అందంగానూ కనిపించింది. ఇక సుదీప్ గురించి చెప్పేదేంముంది. విలన్ గా జీవించేసాడు. సల్మాన్ తో ఫైట్స్ లో సమఉజ్జీగా నిలిచాడు. సల్మాన్ పాత్ర ఎలివేట్ కావడానికి సుదీప్ బాగా ఉపయోగపడ్డాడు. అలీ ఒక చిన్న పాత్రలో మెరిశాడు.

సాంకేతిక వర్గం:
ప్రభుదేవా కథకథనాల విషయంలో తడబడ్డాడు. రొటీన్ కథే అయినా, కథనాన్ని ఆసక్తికరంగా మరల్చలేకపోయాడు. దర్శకుడిగా మాత్రం కొన్ని మార్కులు స్కోర్ చేస్తాడు. సినిమాటోగ్రఫీ దబంగ్ సిరీస్ తరహాలోనే హడావిడిగా ఉంది. సాజిద్-వాజిద్ అందించిన సంగీతం బాగున్నప్పటికీ దబంగ్ సిరీస్ ముందు సినిమాల తరహాలో లేదు. నేపధ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో, విలన్ మధ్యన ఫైట్ ఆసక్తికరంగా సాగింది. ఫ్యాన్స్ కు ఈ ఎపిసోడ్ బాగా నచ్చుతుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మొత్తంగా:
సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని అదనపు చమక్కుల మీద పెట్టిన దృష్టి కథాకథనాల మీద పెట్టి ఉంటే దబంగ్ 3 మరో లెవెల్లో ఉండేది. ఫైట్స్, క్లైమాక్స్, అక్కడక్కడా కొన్ని మెరుపులు తప్పితే దబంగ్ 3 సాధారణ ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు మాత్రం నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

చివరిగా: కేవలం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కోసమే.