మ‌హేష్ సినిమా కోసం `ద‌బాంగ్‌` చిన్న‌ది!


మ‌హేష్ సినిమా కోసం `ద‌బాంగ్‌` చిన్న‌ది!
మ‌హేష్ సినిమా కోసం `ద‌బాంగ్‌` చిన్న‌ది!

ప్రిన్స్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ ,14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో మ‌హేష్‌కి జోడీగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని కీర్తి  సురేష్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది కూడా. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది.

ఇదిలా వుంటే మ‌హేష్ చిత్రానికి `ద‌బాంగ్ 3` బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ ని క‌న్ఫ‌ర్మ్ చేశారు. అయితే సయీని సెలెక్ట్ చేసింది `స‌ర్కారు వారి పాట‌` కోసం కాదు మ‌హేష్ వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `మేజ‌ర్‌` చిత్రానికి. అడివి శేష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `మేజ‌ర్‌`. 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న ఎన్ ఎస్‌జీ క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ స్టోరీ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి మ‌హేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ మూవీ యాభై శాతం పూర్త‌యింది. వచ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ని పునః ప్రారంభించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ కోసం `ద‌బాంగ్ 3` బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ ని ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. ఇందులో మ‌రో హీరోయిన్‌గా శోభిత ధూళిపాల న‌టిస్తోంది. హీరో అడివి శేష్ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌రో హీరోయిన్‌గా స‌యీ ముఖ‌ర్జీని ఎంపిక చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.