దాచేపల్లిలో దారుణం 9 ఏళ్ల బాలిక రేప్


Dachepalli Rape Incident : 9 year girl raped by 50 year old manగుంటూరు జిల్లా దాచేపల్లి లో దారుణం జరిగింది , 9 ఏళ్ల బాలికపై 50 ఏళ్లకు పైగా వయసున్న సుబ్బయ్య అనే వ్యక్తి రేప్ చేయడం సంచలనం సృష్టించింది . ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల వయసున్న బాలిక కు చాకోలెట్స్ కొనిస్తానని మాయమాటలు చెప్పిన సుబ్బయ్య ఆ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తా అని బెదిరించడంతో సైలెంట్ అయిపొయింది . అయితే కొద్దిసేపటికే కడుపు నొప్పి తో బాలిక తీవ్రంగా బాధపడుతుండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు .

బాలిక ని పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగిందని పోలీసులకు సమాచారం అందించడంతో బాలిక కుటుంబం తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యింది . తక్షణమే అత్యాచార నిందితుడు సుబ్బయ్య ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు . ఈ విషయం సుబ్బయ్య కు తెలియడంతో ఇంటి నుండి పారిపోయాడు దాంతో ఆవేశంతో నిందితుడి ఇంటిని ద్వంసం చేసారు . అత్యాచార విషయం క్షణాల్లో వేలాది మందికి తెలియడంతో ముస్లిం లు , ఇతర యువత పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డు మీద బైఠాయించడమే కాకుండా టైర్ల ని రోడ్డు మీద కాల్చి నిరసన వ్యక్తం చేసారు . భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఎక్కువ సంఖ్యలో జనాలు రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దాచేపల్లి లో దాంతో హుటాహుటిన కలెక్టర్ , జిల్లా ఎస్పీ లు దాచేపల్లి కి తరలి వచ్చారు . నిందితుడి ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసినప్పటికీ ఆందోళన కారులు మాత్రం తగ్గలేదు . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సంఘటన పై స్పందించి నిందితుడి ని శిక్షించాలని ఆదేశించగా , పవన్ కళ్యాణ్ కథువా నుండి దాచేపల్లి వరకు జరుగుతున్న సంఘటనలు మనసుని కలిచి వేశాయని , బాధిత కుటుంబానికి అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేసాడు . ఇక ప్రతిపక్ష నేత జగన్ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూనే చంద్రబాబు ప్రభుత్వ పనితీరు పై విరుచుకు పడ్డాడు .