దాదాసాహెబ్ పాల్కే ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఈ సారి హైదరాబాద్ లోనే


Dadasaheb Phalke Award
దాదాసాహెబ్ పాల్కే ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఈ సారి హైదరాబాద్ లోనే

ఇండియన్ సినిమా ఆరాధ్య దేవుడు దాదాసాహెబ్ పాల్కే. ఆయన పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రెస్టీజియస్ అవార్డ్స్ ని ఈ సారి హైదరాబాద్లో గ్రాండ్ గా జరపబోతున్నారు. ఈ ఫంక్షన్ కి సౌత్ ఇండియన్ నటీ నటులందరూ పాల్గొనబోతున్నారు.

ఈ నెల 20న మాదాపూర్ యన్ కన్వెక్షన్ సెంటర్ లో తారల తళుకు బెళుకుల మధ్య అంగరంగ వైభవంగా జరపనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, అనుష్క శెట్టి, సమంత, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు మరికొంతమంది స్టార్స్ రాబోతున్నారు. ఈ ఫంక్షన్లో బ్రహ్మానందం కామిడీ, దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.. వీటితో పాటు స్పెషల్ పోగ్రామ్స్, కామిడీ స్కిట్స్, వీక్షకులను అలరించనున్నాయి..!!