కార్ యాక్సిడెంట్‌.. పీఎస్‌కు రానా త‌మ్ముడు?



కార్ యాక్సిడెంట్‌.. పీఎస్‌కు రానా త‌మ్ముడు?
కార్ యాక్సిడెంట్‌.. పీఎస్‌కు రానా త‌మ్ముడు?

హైరాబాద్ జూబ్లీ హిల్స్ నాలుగు ర‌హ‌దారుల జంక్ష‌న్‌.. నిత్యం ర‌ద్దీగా వుండే ఈ ప్ర‌దేశంలో రానా సోద‌రుడు అభిరామ్ త‌న కారుని ఓవ‌ర్ టేక్ చేశాడంటూ ఆ మ‌ధ్య ఓ వ్య‌క్తిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి అదే త‌ర‌హా ప్ర‌మాదం కార‌ణంగా వార్త‌ల్లో నిలిచారు ద‌గ్గుబాటి అభిరామ్‌. మ‌ణికొండ‌లో జ‌రిగిన ఓ కారు ప్ర‌మాదం నుంచి అభిరామ్ తృటిలో త‌ప్పించుకున్నార‌ట‌. టీవ‌ల రానా పెళ్లి వేడుక‌ల్లో హుషారుగా పాల్గొన్న అభిరామ్ ద‌గ్గుబాటి ఇటీవ‌ల మ‌ణికొండ‌లోని పంచ‌వ‌టి కాలనీలో కారు ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నార‌ట‌.

ఈ ప్ర‌మాదంలో ఎవ‌రిక ఎలాంటి గాయాలు కాలేద‌ని, ఇద్ద‌రూ క్షేమంగానే వున్నార‌ని తెలిసింది. క‌రీంన‌గ‌ర్ జిల్లా కు చెందిన ఓ వ్య‌క్తి  కార్ కొన‌డానికి న‌గ‌రానికి వ‌చ్చాడు. మ‌ణికొండ‌లో కారు చూశారు. అంతా ఓకే టెస్ట్ డ్రైవ్ కోసం పంచ‌వ‌టికి వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో అటు వైపుగా వ‌స్తున్న అభిరామ్ కారు ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు క‌లిసి రాయ‌దుర్గం పీఎస్‌కు వెళ్లి ఒక‌రిపై ఒక‌రు కంప్లైంట్ ఇచ్చుకున్నారు.

ఇద్ద‌రికి బ్రిత్ ఎన‌లైజ‌ర్‌తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన పోలీసులు మ్యం సేవించ‌లేద‌ని గుర్తించారు. ప్ర‌మాదానికి కార‌ణం ఇద్ద‌రూ రాంగ్ రూట్‌లో రావ‌డ‌మేన‌ని పోలీసులు తేల్చేసి కేసు ఫైల్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌గ్గుబాటి అభిరామ్ త్వ‌ర‌లో హీరోగా అరంగేట్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే.