అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ మధ్య వార్ నిజమేనా?


Daggubati and Akkineni fans cold war over Venky Mama
Daggubati and Akkineni fans cold war over Venky Mama

మన స్టార్ హీరోలు అందరూ ఒకరంటే ఒకరు అభిమానంగానే ఉంటారు. ప్రతిసారి రాసుకుని పూసుకుని తిరిగరు కానీ కలిసినప్పుడు మాత్రం ఆప్యాయంగా పలకరించుకోకుండా ఉండరు. కలిసి హాలిడే ట్రిప్ లకు కూడా వెళుతుంటారు. ఒకరి ఫంక్షన్ లకు ఒకరు అటెండ్ అవుతుంటారు. ఇలా ఎన్ని చేస్తున్నా కూడా ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ మాత్రం ఆగట్లేదు. డైరెక్ట్ గా స్టేజ్ మీదే మేము మేము బానే ఉంటాం, మీరు కూడా బాగుండాలి అని స్టార్ హీరోలు చెబుతున్నారంటే ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. మాములు హీరోల మధ్య ఫ్యాన్స్ వార్స్ ఉంటే ఏమో అనుకోవచ్చు కానీ రెలెటివ్స్ అయిన హీరోల ఫ్యాన్స్ మధ్యన కూడా ఇలాంటి ఫ్యాన్స్ వార్స్ ఉండడం విచిత్రమే.

అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్.. ఈ ఇద్దరూ రిలేటివ్స్ అన్న సంగతి అందరికీ తెల్సిందే. వరసకు నాగార్జునకు వెంకటేష్ బావ మరిది అవుతాడు. అయితే నాగార్జున తన మొదటి భార్య నుండి విడిపోయి విడాకులు తీసుకున్నాడు. రెండు వైపులా ఫ్యామిలీస్ ఈ విషయంలో ఇద్దరికీ అండగా నిలబడ్డాయి. ఇలాంటి ఒక సంఘటన జరిగినా వెంకటేష్, నాగార్జున ఎప్పుడూ క్లోజ్ గానే ఉన్నారు. బయట ఫంక్షన్స్ లో కూడా సౌకర్యంగానే కలుస్తారు. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం పరిస్థితి అలా లేదు. అక్కినేని ఫ్యాన్స్, దగ్గుబాటి ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ ఇంకా నడుస్తూనే ఉంది.

అక్కినేని నాగ చైతన్య తన మావయ్య అయిన దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి వెంకీ మామ చేసిన విషయం తెల్సిందే. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు కట్టిన బ్యానర్స్ ఒకసారి పరిశీలిస్తే ఈ రెండు ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్యన కోల్డ్ వార్ అర్ధమవుతుంది. నాగ చైతన్యకు బ్యానర్ లో నాగార్జున మరియు ఇతర అక్కినేని హీరోలు ఉంటున్నారు కానీ వెంకటేష్ కు స్థానం ఇవ్వట్లేదు. అలాగే వెంకటేష్ ఉన్న బ్యానర్ లో రానా ఉన్నాడు కానీ నాగ చైతన్యకు స్థానం లేదు.

సిటీల్లో ఇది తక్కువే ఉన్నా ఊర్లలో ఇంకా ఈ ఫీలింగ్ ఎక్కువే ఉంది. ఇలా ఇద్దరు హీరోలను కలిపి ఒక పోస్టర్ మీదే చూడలేని ఈ ఫ్యాన్స్ ఇక సినిమాను ఎలా చూస్తారు?.