ఆ వార్తను ఖండించిన‌‌ ద‌గ్గుబాటి ఫ్యామిలీ!ఆ వార్తను ఖండించిన‌‌ ద‌గ్గుబాటి ఫ్యామిలీ!
ఆ వార్తను ఖండించిన‌‌ ద‌గ్గుబాటి ఫ్యామిలీ!

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని మ‌ణికొండ‌కు చెందిన పంచ‌వ‌టి కాల‌నీలో నిర్మాత డి. సురేష్‌బాబు త‌న‌యుడు, హీరో రానా సోద‌రుడు అభిరామ్ కార్ ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని, ఆ త‌రువాత స‌ద‌రు యాక్సిడెంట్ అయిన కారు వ్య‌క్తి, అభిరామ్ రాయ‌దుర్గం పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారంటూ వార్త‌లు శికారు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్ర‌మాదానికి అభిరామ్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ద‌గ్గుబాటి ఫ్యామిలీ వివ‌ర‌ణ ఇచ్చింది.

కారు ప్ర‌మాదానికి, ద‌గ్గుబాటి అభిరామ్ కు ఎలాంటి సంబంధం లేద‌ని, అది ద‌గ్గుబాటి కారు కానేకాద‌ని తాగా ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు స్ప‌ష్టం చేశారు. రాయ‌దుర్గం ప‌రిథిలోని మ‌ణికొండ‌లో ద‌గ్గుబాటి అభిరామ్ కారు ప్ర‌మాదానికి గురైంద‌ని, ఎదురుగా వ‌స్తున్న కారును అభిరామ్ కారు ఢీకొట్టింద‌ని మీడియాలో, ఆన్‌లైన్‌లో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, అది కేవ‌లం వ‌దంతి మాత్ర‌మేన‌ని, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీదే కాద‌ని చెబుతున్నారు.

ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని,  వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు విజ్ఞ‌ప్తి చేశారు. అభిరామ్ త్వ‌ర‌లో హీరోగా ప‌రిచ‌యం కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నిర్మాత డి. సురేష్ బాబు మీడియా ముఖంగా వెల్ల‌డించారు.