సైలెంట్‌గా కొత్త షో పూర్తి చేశాడు!


సైలెంట్‌గా కొత్త షో పూర్తి చేశాడు!
సైలెంట్‌గా కొత్త షో పూర్తి చేశాడు!

వెండితెర‌పై వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ బిజీగా వుండే రానా వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బుల్లితెర‌ని కూడా బాగానే వాడేస్తుంటారు. `నం.1 యారీ` పేరుతో టాలీవుడ్ సెల‌‌బ్రిటీల‌తో టాక్ షో చేసిన రానా సైలెంట్‌గా మ‌రో షోని పూర్తి చేశార‌ట‌. `వై ఆర్ యూ` అనే పురుతో రూపొందించిన ఈ కామెడీ షోని నెట్ ఫ్లిక్స్ కోసం చేశార‌ట. త్వ‌ర‌లోనే ఇది అందులో టెలీకాస్ట్ కానుంద‌ని తాజాగా రానా వెల్ల‌డించారు.

ఇటీవ‌ల మిహీకా బ‌జాజ్‌ని వివాహం చేసుకోబోతున్నానంటూ రానా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. రోకా ఫంక్ష‌న్ పేరుతో ఇరు కుటుంబాల‌కు చెందిన ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా రామానాయుడు స్టూడియోస్‌లో ప్ర‌త్యేకంగా స‌మావేశం, కావ‌డం, కాబోయే వ‌ధూవ‌రులిద్ద‌రూ ఫొటోల‌కు పోజులివ్వ‌డం, ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం తెలిసిందే. రానా, మిహీకా బ‌జాజ్‌ల వివాహం డిసెంబ‌ర్‌లో జ‌ర‌గే అవ‌కాశం వుంది.

ఈ సంద‌ర్భంగా మంచు ల‌క్ష్మీతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన రానా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. చాలా కాలంగా త‌న‌కు మిహీకా తెలిసిన ఈ మ‌ధ్య త‌నే నా జీవిత భాగ‌స్వామ‌ని తెలుసుకున్నాన‌ని, చాలా త‌క్కువ స‌మ‌యంలోనే తాజా నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, ఈ విష‌యం చెప్ప‌గానే ఫ్యామిలీ మెంబ‌ర్స్ అవాక్క‌య్యార‌ని రానా ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.