కారుతో భీభత్సం సృష్టించిన నిర్మాత సురేష్ బాబు


daggubati suresh babu car accident in secunderabad

అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు నిన్న రాత్రి కారుతో భీభత్సం సృష్టించాడు . సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ కు వెళ్ళే దారిలో రాంగ్ రూట్ లో వచ్చిన సురేష్ బాబు వేగంగా వచ్చి దాన్ని నియంత్రించలేక ఓ స్కూటీ ని గుద్దేసాడు . ఆ స్కూటీ పై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి దాంతో అక్కడే ఉన్న వాళ్ళు గాయాలపాలైన వాళ్ళని యశోద ఆసుపత్రికి తరలించారు . సురేష్ బాబు కారు యాక్సిడెంట్ లో గాయపడిన వాళ్ళు సతీష్ చంద్ర (35 ) దుర్గాదేవి (30 ) సిద్దేశ్ చంద్ర (3 ) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . కారు యాక్సిడెంట్ కు గురైనప్పుడు సురేష్ బాబు స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు దాంతో యాక్సిడెంట్ కాగానే నేరుగా ఖార్ఖానా పోలిస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పాడట .

రాత్రి పూట రాంగ్ రూట్ లో వెళ్ళడమే కాకుండా యాక్సిడెంట్ కూడా చేయడంతో కార్ఖానా పోలీసులు సురేష్ బాబు కి నోటీసులు జారీ చేసారు . కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో సురేష్ బాబు కి ఎలాంటి గాయాలు కాలేదు . తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సురేష్ బాబు హీరో వెంకటేష్ కు సోదరుడు కాగా రానా కు తండ్రి అన్న విషయం విదితమే ! ప్రస్తుతం దగ్గుబాటి సురేష్ బాబు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు .

English Title: daggubati suresh babu car accident in secunderabad

daggubati suresh babu car accident in secunderabad