ఒకలు కాకపోతే ఇంకొకలు సినిమా అంటున్నారు..ఇందులో నిజం ఎంత?…


ఒకలు కాకపోతే ఇంకొకలు సినిమా అంటున్నారు..ఇందులో నిజం ఎంత?...
ఒకలు కాకపోతే ఇంకొకలు సినిమా అంటున్నారు..ఇందులో నిజం ఎంత?…

మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలు చేసుకుంటున్న సమయంలో రాజకీయాల వైపు వెళ్లారు. రాజకీయాలలో అనుకోని పరిణామాల వాళ్ళ ఓటమిని ఎదుర్కున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు సమయం తీసుకున్న చిరంజీవి గారు మరలా తిరిగి వచ్చి ఎదావిదిగా సినిమాలు చేసుకుంటున్నారు. అన్నయ్య బాటలో నడిచిన పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ గారు కూడా రాజకీయాల వైపు వెళ్లారు.

అన్నయ్య కి ఎలా జరిగిందో? అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. మరి చిరంజీవి గారి లాగానే తిరిగి వచ్చి సినిమాలు చేస్తాడు. తొందరలోనే మా నిర్మాణంలో సినిమా చేస్తారు. నా దర్శకత్వంలో సినిమా చేస్తారు అని ఒకొక్క దర్శకులు వెలుగులోకి వచ్చారు. నిర్మాత దిల్ రాజు ‘పింక్’ సినిమా తెలుగు హక్కుల్ని కొనేసారు. అందులో పవన్ కళ్యాణ్ గారు హీరో అని అన్నారు. పవన్ అభిమానులు నిత్యం దిల్ రాజు గారు గురించి ఆలోచించేవారు సినిమా గురించి ఏదొక విషయం చెప్తారు అని ట్విట్టర్ లో, ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవాళ్ళు.

ఇక దర్శకులు కిషోర్ కుమార్ పార్ధసాని (డాలి) గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది అని విన్నాం. వెళ్లిన కిషోర్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కాలిసారో? తెలీదు కానీ పవన్ అభిమానులు మాత్రం సినిమా గురించి అనుకున్నారు. అందులో నిజం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒక సినిమాని పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు అని విన్నాం. పరుచూరి బ్రదర్స్ అయిన ‘గోపాల కృష్ణ’ గారు కూడా పవన్ కళ్యాణ్ తొందరలో సినిమాలకి వస్తారు అని అన్నారు. అందులో నిజం ఎంత ఉందొ పవన్ అభిమానవులకి మాత్రమే తెలుసు.

ఇప్పుడు ఇంకొక దర్శకుని పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఆయనే ‘క్రిష్ (రాధా కృష్ణ జాగర్లమూడి)’. క్రిష్-పవన్ కళ్యాణ్ కలయికలో ఒక సినిమా ఉండబోతుంది అని మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ గారు వెళ్లి పవన్ కళ్యాణ్ గారికి కథా చెపితే ఆ కథా పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చిందంట. వెంటనే ఒప్పుకుంటే మాట ఇచ్చిన దిల్ రాజు గారిని ఇబ్బందుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పి ముందు జాగ్రత్తతో సినిమా చేస్తాను కానీ సమయం పడుతుంది అని చెప్పారంటా.

ఇక విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు క్రిష్ జపం చేస్తున్నారు. ఒకవేళ అనుకోని పరిణామాలు చోటు చేసుకొని దిల్ రాజు గారి సినిమా కంటే క్రిష్ గారి సినిమా మొదలు అయితేనే బాగుంటుంది అని పవన్ అభిమానులు అనుకుంటున్నారు.ఎందుకంటే దిల్ రాజు గారి ‘పింక్’ సినిమా రీమేక్ సినిమా అని, క్రిష్ గారి సినిమా అయితే బాగుంటుంది అని పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందో? అసలు సమస్య ఎక్కువై పోయి సినిమాలు చెయ్యను అని గట్టిగా చెబితే ఏంటి పరిస్థితి?