ఎన్టీఆర్ ని రిజెక్ట్ చేసిన డైసీ ఎడ్గర్ జోన్స్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని రిజెక్ట్ చేసింది డైసీ ఎడ్గర్ జోన్స్ . బ్రిటిష్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ కు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ లభించింది . అయితే తొలుత ఈ సినిమాని అంగీకరించింది కూడా . ఎందుకంటే బాహుబలి చిత్రాలతో తన ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడు కావడంతో డైసీ ఎడ్గర్ జోన్స్ సంతోషంగా ఒప్పుకుంది .

 

ఆ మేరకు దర్శకులు గతనెలలో జరిగిన ప్రెస్ మీట్ లో హీరోయిన్ లుగా అలియా భట్ , డైసీ ఎడ్గర్ జోన్స్ లను ప్రకటించాడు కూడా . పూణే షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది ఈలోపు రాంచరణ్ కాలికి గాయం కావడమో లేక మరో కారణమో కానీ ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చింది డైసీ ఎడ్గర్ జోన్స్ .

ఆర్ ఆర్ ఆర్ లో నటించేది లేదని తేల్చి చెప్పడంతో షాక్ అవ్వడం ఆ చిత్ర బృందం వంతయ్యింది . ఎన్టీఆర్ సరసన అందునా రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకోరు కానీ పిలిచి మరీ డైసీ కి ఛాన్స్ ఇస్తే మాత్రం రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించింది డైసీ ఎడ్గర్ జోన్స్ . డైసీ హ్యాండ్ ఇవ్వడంతో ఎన్టీఆర్ కోసం మరో భామని వెతికే పనిలో పడ్డారు దర్శకులు రాజమౌళి .