దండుపాళ్యం 4 కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు


Dandupalyam 4 facing censor problem

దండుపాళ్యం 4 చిత్రానికి సెన్సార్ బోర్డు తీవ్ర షాక్ ఇచ్చింది . దండుపాళ్యం 4 లో హింసాత్మక సన్నివేశాలు , శృంగార సన్నివేశాలు మితిమీరి ఉన్నాయని అందుకే ఈ సినిమాని సెన్సార్ చేసేది లేదని తేల్చి చెప్పారట . దాంతో షాక్ తిన్న ఆ చిత్ర బృందం సెన్సార్ బోర్డు పై ఆగ్రహంగా ఉంది . ఇక నిర్మాత వెంకటేష్ అయితే కర్ణాటక ఫిలిం ఛాంబర్ తో పాటుగా కేంద్ర సెన్సార్ బోర్డు కు ఫిర్యాదు చేసాడు .

దండుపాళ్యం అనే చిత్రం పేరుతో ఇప్పటివరకు మూడు భాగాలు రిలీజ్ కాగా అందులో మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయ్యింది . దాంతో తాజాగా దండుపాళ్యం 4 తెరకెక్కింది . అయితే ఈ సినిమాలో శృంగార సన్నివేశాలతో పాటుగా హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండటంతో కర్ణాటక సెన్సార్ బోర్డు సెన్సార్ చేయడానికి నిరాకరించింది . సుమన్ రంగనాధ్ , పూజా గాంధీ ఈ చిత్రంలో నటించారు .

English Title: Dandupalyam 4 facing censor problem