సెన్సార్ ఇబ్బందులను అధిగమించిన దండుపాళ్యం 4


Dandupalyam 4 locks August 15th release
Dandupalyam 4 locks August 15th release

ఎట్టకేలకు సెన్సార్ ఇబ్బందులను అధిగమించి విడుదలకు సిద్ధమవుతోంది దండుపాళ్యం 4. కేటి నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకట్ నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దండుపాళ్యం సిరీస్ లో నాల్గవ చిత్రం కావడం విశేషం.

దండుపాళ్యం మొదటి సిరీస్ సంచలన విజయం సాధించడంతో రెండో భాగం , మూడో భాగం తీశారు. అయితే రెండో భాగం యావరేజ్ కాగా మూడో పార్ట్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది . దాని ఫలితం ఎలా ఉన్నప్పటికీ దండుపాళ్యం 4 ని రూపొందించారు. ఇక ఈ సినిమా నెలల తరబడి సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే ఎట్టకేలకు సెన్సార్ ఇబ్బందులను దాటుకుని రిలీజ్ కి సిద్ధమైంది .