దర్బార్ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


దర్బార్ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
దర్బార్ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా దర్బార్ మొదటి రోజే దాదాపు నాలుగు కోట్లు వసూలు చేసి మంచి స్టార్ట్ ను నమోదు చేసింది. నయనతార హీరోయిన్ గా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన సంగతి తెల్సిందే. రజినీకాంత్ అభిమానులకు నచ్చేలా మురుగదాస్ ఈ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెల్సిందే. మొదటి రెండు రోజుల్లో దాదాపు ఐదున్నర కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల వైకుంఠపురములో విడుదలవడంతో థియేటర్లు మొత్తం వీటికే కేటాయించడం జరిగింది. దాంతో దర్బార్ కలెక్షన్స్ కు గండి పెట్టింది.

5 రోజులకు దర్బార్ కలెక్షన్స్ రిపోర్ట్ డీటెయిల్స్:
నైజాం :Rs 3.96 Cr
సీడెడ్ : Rs 0.94 Cr
గుంటూరు : Rs 0.59 Cr
వైజాగ్ : Rs 0.82 Cr
ఈస్ట్ : Rs 0.52 Cr
వెస్ట్ : Rs  0.35  Cr
నెల్లూరు : Rs 0.31 Cr
కృష్ణ : Rs 0.42Cr
ఆంధ్ర + తెలంగాణ : Rs 7.91 Cr షేర్స్

దర్బార్ సినిమా దాదాపు 14.5 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు పూర్తిగా డామినేట్ చేస్తుండడంతో దర్బార్ కోలుకోవడం కష్టమనే చెప్పాలి. అయితే ఇంకా సంక్రాంతి సెలవులు ఉండడంతో ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.