దర్బార్ 7 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


Darbar 7 days collections report
Darbar 7 days collections report

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రం తొలిరోజు సూపర్ కలెక్షన్స్ సాధించిన విషయం తెల్సిందే. రెండో రోజు కూడా స్టడీగా ఉన్న ఈ చిత్రం మూడో రోజు మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల కావడంతో బాగా స్లో అయింది. ఆ తర్వాత రోజు అల వైకుంఠపురములో కూడా విడుదల కావడంతో చాలా స్లో అయింది. దర్బార్ కు టాక్ బాగానే వచ్చింది కానీ రెండు పెద్ద తెలుగు సినిమాలు విడుదల కావడం దర్బార్ కు ప్రతికూలంగా మారింది. తొలి రెండు రోజుల్లోనే దాదాపుగా 6 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం 7 రోజులు ముగిసేసరికి 9 కోట్లకు చేరువైంది.

దర్బార్ చిత్ర 7 రోజుల కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం :Rs 4.51 Cr

సీడెడ్ : Rs 1.01 Cr

గుంటూరు : Rs 0.65 Cr

వైజాగ్ : Rs 0.96 Cr

ఈస్ట్ : Rs 0.59 Cr

వెస్ట్ : Rs  0.40  Cr

నెల్లూరు : Rs 0.35 Cr

కృష్ణ : Rs 0.48 Cr

ఆంధ్ర + తెలంగాణ : Rs 8.95 Cr Shares

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించిన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా నివేతా థామస్ రజనీ కూతురుగా నటించింది. అనిరుధ్ సంగీతం అందించాడు. ప్రపంచవ్యాప్తంగా 7,000 స్క్రీన్స్ లో రిలీజైన సంగతి తెల్సిందే. తమిళనాడులో 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం కర్ణాటకలో సైతం 15 కోట్లకు రీచ్ అయింది.

తెలుగులో ఈ చిత్రం 14 కోట్లకు బిజినెస్ కాబడింది. అయితే ఫుల్ రన్ లో మాత్రం 10 కోట్లకు అటూ ఇటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో దర్బార్ కు ఇక కలెక్షన్స్ తగ్గుముఖ్యం పట్టే అవకాశాలున్నాయి.