సెంచ‌రీ దాటేసిన త‌లైవా `ద‌ర్బార్`!


సెంచ‌రీ దాటేసిన త‌లైవా `ద‌ర్బార్`!
సెంచ‌రీ దాటేసిన త‌లైవా `ద‌ర్బార్`!

సైలెంట్‌గా వ‌చ్చినా వైలెంట్ హిట్‌ని సొంతం చేసుకున్నారు ర‌జ‌నీకాంత్‌. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `ద‌ర్బార్‌`. ఎ.ఆర్‌. మురుగ‌దాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ టిపిక‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంక్రాంతి బ‌రిలో ముందే దిగిన ఈ చిత్రం వ‌సూ్ల ప‌రంగా ర‌జ‌నీ గ‌త చిత్రాల‌కు భిన్నంగా రికార్డులు సృష్టిస్తోంది.

జ‌న‌వ‌రి 9న విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు చెన్నైలో భారీ వ‌సూళ్ల‌ని న‌మోదు చేసుకుంది. ప్రారంభ వ‌సూళ్ల‌తో రికార్డుల మోత మొద‌లుపెట్టిన ఈ సినిమా తొలి వారంలో ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడులో 58 నుంచి 60 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

త‌మిళ‌నాడులోనే 650 థియ‌ట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టికే 10 కోట్ల మార్కుని దాటేసింది. ఈ వారాంతానికి ఆ ఫిగ‌ర్ 18 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని, కేర‌ళ‌లో 7 కోట్లు, క‌ర్ణాట‌క‌లో 14 కోట్లు వ‌సూలు చేయ‌నున్న‌ట్టు చిత్ర వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అన్ని ఏరియాలు క‌లిపి ఇండియా వైడ్‌గా ఇప్ప‌టికే ద‌ర్బార్ వంద కోట్ల మార్కుకు చేరుకుంది. ఓవ‌ర్సీస్ మార్కెట్‌లో మ‌రో యుఎస్‌, దుబాయ్‌తో క‌లిసి 21 కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్టు తెలిసింది. దీంతో త‌లైవా `ద‌ర్బార్‌` సెంచ‌రీ మార్కుని దాటిన‌ట్టే.