ఆకాశం దాటిన అభిమానం – రజనీ దర్బార్ క్రేజ్


ఆకాశం దాటిన అభిమానం – రజనీ దర్బార్ క్రేజ్
ఆకాశం దాటిన అభిమానం – రజనీ దర్బార్ క్రేజ్

తమిళనాడు వెళ్తే, కోటీశ్వరుడు దగ్గర నుండి కూలీ పని చేసుకుని బత్రికే వాళ్ళ వరకూ వెళ్ళే దారిలో కేవలం రెండు విషయాలు కనపడితే ధనిక – పేద తేడ లేకుండా ఆగి చూసి, దణ్ణం పెట్టుకుని వెళ్తారు. ఒకటి వినాయకుడికి , రెండు సూపర్ స్టార్ రజనీకాంత్ కటౌట్ కి. ఇందులో పొగడ్త ఏమీలేదు. రీసెంట్ గా జరిగిన, తెలుగు దర్బార్ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా, రజనీకాంత్ ఒకే ఒక్క మాటలో “తక్కువ తినండి; తక్కువ గా ఆశ పడండి” అని తనదైన స్టైల్ లో జీవిత సత్యాన్ని సింపుల్ గా చెప్పారు. నిజంగా తమిళ అభిమానులకు రజనీ సినిమా రిలీజ్ అంటే ఒక పండుగ.

అసలు సౌత్ ఇండియాలో పెద్ద కటౌట్ లకు పాలతో అభిషేకం చేసే ట్రెండ్ తో మొదలుపెడితే ఇప్పుడు కటౌట్ లకు బీర్ లతో అభిషేకం చేసే దాకా వెళ్ళింది రజనీ మానియా. అప్పటికీ రజనీ తన అభిమానులకు వృధా ఖర్చులు పెట్టద్దని చెప్పినా, కొంతమంది వినరు. ఇప్పుడు దర్బార్ సినిమాకు అయితే ఇప్పటికే కాలేజ్ లు, స్కూల్స్, ప్రైవేటు, కార్పోరేట్ ఉద్యోగ సంస్థలు సెలవు ఇచ్చేసాయి. ఇక అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి, భారీ కటౌట్ లకు హెలికాప్టర్ ద్వారా పూలు చల్లడానికి పోలీసులను పర్మిషన్ అడుగుతున్నారు. కొన్ని విమాన సంస్థలు ఇప్పటికే తమ ఫ్లైట్ లకు దర్బార్ బ్రాండింగ్ చేసేసాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయ్యి, ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.